కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ దారిలో పయనిస్తూ ఫ్యాన్స్ ని ఊపేస్తున్న మరో క్రేజీ చిత్రం 'కాంతార'. కాంతార మూవీ దర్శకుడు, నటుడు అయిన రిషబ్ శెట్టి పేరు ఇండియా వ్యాప్తంగా మారుమోగుతోంది.
కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ దారిలో పయనిస్తూ ఫ్యాన్స్ ని ఊపేస్తున్న మరో క్రేజీ చిత్రం 'కాంతార'. కాంతార మూవీ దర్శకుడు, నటుడు అయిన రిషబ్ శెట్టి పేరు ఇండియా వ్యాప్తంగా మారుమోగుతోంది.
26
Pragathi rishab shetty
ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు రిషబ్ శెట్టి గురించి తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. కాంతార మూవీ 100 కోట్ల వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ కి ఈ చిత్రం కాసుల పంట పండిస్తోంది.
36
ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి గురించి తెలుసుకునేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అతడి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి భార్య పేరు ప్రగతి. ఒక సినిమా ఈవెంట్ లో వీరి మధ్య తొలి పరిచయం ఏర్పడింది. రిషబ్ శెట్టి.. రక్షిత్ శెట్టితో అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. అందులో కిర్రాక్ పార్టీ చిత్రం కూడా ఒకటి.
46
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో ఒక చిత్ర ఈవెంట్ కి ప్రగతి హాజరైంది. ఆ ఈవెంట్ లో రిషబ్.. ప్రగతిని చూశారు. చూడగానే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉందే అని రిషబ్ కి అనిపించింది. ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ పేస్ బుక్ ఓపెన్ చేశాడు. ఫేస్ బుక్ లో ఏడాది క్రితం ప్రగతి రిషబ్ కి ఫ్రెండ్ రిక్వస్ట్ పంపింది.
56
వెంటనే రిషబ్ ఫ్రెండ్ రిక్వస్ట్ యాక్సెప్ట్ చేయడంతో వీరి మధ్య మాటలు మొదలయ్యాయి. నెమ్మదిగా మనసులు కలిశాయి. కానీ ప్రగతి ఇంట్లో వాళ్ళకి ఈ సంబంధం ఇష్టం లేదు. దానికి కారణం రిషబ్ సినిమా వాడు కావడం. కానీ పెద్దలని ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రగతి ఐటి జాబ్ కూడా మానేసి రిషబ్ కి సపోర్ట్ గా నిలిచింది.
66
ఇటీవల ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ తాను సక్సెస్ అయ్యానంటే.. కాంతర చిత్రం సక్సెస్ అయింది అంటే అందులో ప్రగతి క్రెడిట్ కూడా ఉందని భార్యపై ప్రశంసలు కురిపించాడు. కాంతార చిత్రంలో రిషబ్ దరకత్వం, ట్విస్టులు అదిరిపోయేలా ఉన్నాయని ఆడియన్స్ అంటున్నారు.