పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పవన్, రేణుదేశాయ్ ఇద్దరికీ తమ పిల్లలు అకీరా, ఆద్య అంటే అమితమైన ప్రేమ. అందుకే పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలకు సమయం కేటాయిస్తుంటారు.