సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ట్రైలర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ట్రైలర్ బాగుంటే సినిమాపై అంచనాలు పెరిగి, తొలిరోజు చూసేలా ప్రోత్సహిస్తుంది. అలా అంచనాలు పెంచిన సినిమానే కాంతార చాప్టర్ 1.
24
కాంతారకు ప్రీక్వెల్
2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్ ఇది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబాలే ఫిలింస్ నిర్మించింది. అక్టోబర్ 2న విడుదల కానుంది. దీని ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన వస్తోంది.
34
కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రికార్డుల మోత
కాంతార చాప్టర్ 1 ట్రైలర్ 24 గంటల్లో సాధించిన వ్యూస్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో 107 మిలియన్ల (10.7 కోట్లు) వ్యూస్ సాధించిందని తెలిపింది.
దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ల జాబితాలో 'కాంతార చాప్టర్ 1' రెండో స్థానంలో నిలిచింది. సలార్ (113.2M) మొదటి స్థానంలో ఉండగా, కేజీఎఫ్ 2 (106.5M), పుష్ప 2 (104.2M) రికార్డులను కాంతార అధిగమించింది.