చిరంజీవినే కాదు, రాఘవేంద్రరావు చేత ఫస్ట్ నైట్‌ చేయించుకున్న మరో స్టార్‌ ఎవరో తెలుసా? రూమ్‌ ఓపెన్‌ చేసి చూస్తే

Published : Oct 06, 2025, 07:25 PM IST

దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాల్లో ఫస్ట్ నైట్‌ చేయడం కాదు, రియల్‌ లైఫ్‌లో కూడా హీరోలకు ఫస్ట్ నైట్‌లు చేశారు. అలా దర్శకేంద్రుడి సమక్షంలో చిరంజీవితోపాటు మరో స్టార్‌ ఫస్ట్ నైట్‌ జరిగింది. ఆయన ఎవరంటే? 

PREV
14
రియల్‌ లైఫ్‌లో స్టార్స్ కి ఫస్ట్ నైట్‌ చేసిన రాఘవేంద్రరావు

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సినిమాల్లో పాటల గురించి ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయన క్రియేట్‌ చేసిన మార్క్ అలాంటిది. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ని వేరే లెవల్‌లో చూపించారు. పాటల చిత్రీకరణ, అలంకరణ ఆయన సినిమాల్లో చాలా స్పెషల్‌గా ఉంటాయి. అవి మాస్‌ ఆడియెన్స్ నే కాదు, క్లాస్‌ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటాయి. అందుకే ఆయన సినిమాల్లో పాటలు ఇప్పుడు చూసినా కనువిందుగా ఉంటాయి. కొన్ని సీన్లు వెంటాడుతుంటాయి. ఆయన సినిమాల్లో పాటలతోపాటు ఫస్ట్ నైట్‌ సీన్లు కూడా అదిరిపోతాయి. వైట్‌ బెడ్‌, గులాబీ పూలు, పండ్లు ఇలా ఆద్యంతం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయా సీన్లకి ఆడియెన్స్ చూపు తిప్పుకోలేరని చెబితే అతిశయోక్తి కాదు. ఆ లుక్‌తోనే రొమాంటిక్‌ ఫీల్‌ని తెప్పించగలరు రాఘవేంద్రరావు. అయితే  సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ రాఘవేంద్రరావు అంతే రొమాంటిక్‌. ఆ టేస్ట్ ని రియల్‌ లైఫ్‌లోనూ స్టార్స్ విషయంలోనూ నిజం చేసి చూపించారు.  చిరంజీవితోపాటు మరో స్టార్‌కి ఫస్ట్ నైట్‌ చేశారు. 

24
ట్రైన్‌లో చిరంజీవి, సురేఖలకు ఫస్ట్ నైట్‌ చేసిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు ఆధ్వర్యంలోనే మెగాస్టార్‌ చిరంజీవి ఫస్ట్ నైట్‌ జరగడం విశేషం. ఈ విషయాన్ని ఏకంగా చిరునే వెల్లడించారు. తన పెళ్లి టైమ్‌లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు మెగాస్టార్‌. ఆ ఏడాది ఏకంగా పది సినిమాలు చేశారంటే ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం రెండు, మూడు రోజుల్లోనే పెళ్లి తంతుని ముగించారట. ఆ తర్వాత వెంటనే సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయారు చిరు. ఆ సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమానే షూటింగ్‌ జరుగుతుంది. డేట్స్ లేకపోవడంతో పెళ్లి చేసుకొని డైరెక్ట్ గా షూటింగ్‌ కి వెళ్లిపోయారట చిరు. ఊటిలో షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. దీంతో రాఘవేంద్రరావు పిలుపు మేరకు ఆయన మరో మాట లేకుండా షూటింగ్‌కి వెళ్లారు. చిత్రీకరణ పూర్తి చేశారు. అనంతరం చిరుని క్రేజీగా సర్‌ప్రైజ్‌ చేశారు రాఘవేంద్రరావు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత చెన్నై వెళ్లేందుకు ట్రైన్‌ ఎక్కారు చిరు, ఆయన భార్య సురేఖ. ఇద్దరు తమకు బుక్‌ చేసిన బెర్త్ కి వెళ్లారు. తన బెర్త్ కి వెళ్లేవరకు దర్శకుడు రాఘవేంద్రరావు కూడా వెంటే ఉన్నారు. లోపలికి వెళ్లాక అక్కడి డెకరేషన్‌ చూసి చిరు, సురేఖ షాక్‌. తమ ఫస్ట్ నైట్‌ కోసం ఆ బెర్త్ మొత్తం డెకరేట్‌ చేయించారు రాఘవేంద్రరావు. `నా సినిమా కోసం మీ హనీమూన్‌ని కూడా త్యాగం చేసి వచ్చారు. ఇప్పుడు ఎంజాయ్‌ చేయండి` అని చెప్పి వెళ్లిపోయాడట. అలా తమ ఫస్ట్ నైట్‌ ట్రైన్‌లో జరిగిందని వెల్లడించారు చిరు. రాఘవేంద్రరావు నిర్వహించిన సౌందర్య లహరి షోలో ఆయన సమక్షంలోనే ఈ విషయాలను పంచుకున్నారు మెగాస్టార్‌.

34
అలీ విషయంలో కూడా అదే చేసిన రాఘవేంద్రావు

అయితే ఇలానే మరో స్టార్‌ విషయంలో జరిగిందట. అది ఎవరో కాదు స్టార్‌ కమెడియన్‌ అలీ. ఆయనకు కూడా రాఘవేంద్రరావు ఇలాంటి సర్‌ప్రైజే ఇచ్చారట. ఆ టైమ్‌లో `ముద్దుల ప్రియుడు` సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అందులో ఓ ఆర్టిస్ట్ హ్యాండిచ్చాడట. దీంతో ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు దర్శకుడు. ఆ సమయంలోనే అలీ గుర్తుకు వచ్చారు. అదే రోజు అలీ పెళ్లి రాజమండ్రిలో జరుగుతుంది. అలీ ఉంటేనే ఆ పాత్ర బాగుంటుందని భావించారు రాఘవేంద్రరావు. వెంటనే స్థానికంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్‌కి ఫోన్ చేసి అలీని లైన్‌లోకి తీసుకున్నారు. అప్పటికే పెళ్లి అయిపోయింది. సాయంత్రం రిసెప్షన్‌ ఉంది. మధ్యాహ్నం దర్శకుడు ఫోన్‌ చేసి, `అలీ రిసెప్షన్‌ అయిపోగానే ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌ వచ్చేయ్‌` అన్నాడు. దెబ్బకి అలీ షాక్‌. సార్‌ ఏమంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అలీ. `నువ్వు వచ్చేయబ్బా.. మీ హనీమూన్‌ నేను చేస్తాన`ని చెప్పాడట దర్శకుడు. అయినా అలీ అయోమయంలో పడ్డారు. `ఇలా సినిమా షూటింగ్‌ ఉంది, నువ్వే ఆ పాత్రని చేయాల`ని రాఘవేంద్రరావు చెప్పడంతో కాదనలేక రిసెప్షన్‌ పూర్తి చేసుకుని ఫ్లైట్‌లో షూటింగ్‌కి వెళ్లిపోయాడు అలీ.

44
రూమ్‌ ఓపెన్‌ చేసి చూస్తే అలీ షాక్‌

ఫ్లైట్‌ దిగి డైరెక్ట్ గా షూటింగ్‌కి వెళ్లిపోయారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఆ సినిమా సెట్లోనే హీరో వెంకటేష్‌, రంభ ఉన్నారు. పక్క(గ్యాంగ్‌ మాస్టర్‌) సెట్‌లో కృష్ణంరాజు, రాజశేఖర్‌, నగ్మ ఉన్నారు. వారందరి సమక్షంలో కేక్‌ కట్‌ చేయించారట. షూటింగ్‌ అయిపోయిందని చెప్పి రూమ్‌కి వెళ్లిపో అన్నారట రాఘవేంద్రరావు. రూమ్‌ కి వెళ్లగానే మొత్తం డెకరేట్‌ చేసి ఉంది. రూమంతా పూలతో డెకరేట్‌ చేయించారట. అది చూసి తాను ఆశ్చర్యపోయినట్టు అలీ తెలిపారు. వామ్మో రాఘవేంద్రరావు మామూలోడు కాదయ్యా అని హ్యాపీగా ఫీలయ్యాడట. ఈ విషయాన్ని `అలీతో సరదా`గా షోలో రాఘవేంద్రరావు గెస్ట్ గా పాల్గొనగా, ఆయన సమక్షంలోనే ఈ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు అలీ. ఇలా అటు చిరంజీవి, ఇటు అలీ ఫస్ట్ నైట్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో జరగడం విశేషం. సినిమాల్లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ ఆయన ఎంత రొమాంటిక్‌ అనేది వీటిని బట్టి అర్థమవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories