`కాంతార 2` రిలీజ్‌ డేట్‌.. రిషబ్‌ శెట్టి టార్గెట్‌ ఆ రోజే

Published : Nov 17, 2024, 06:38 PM IST

రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన `కాంతార` సినిమా పెద్ద హిట్‌ అయిన నేపథ్యంలో తాజాగా `కాంతార 2`(కాంతార చాప్టర్ 1) విడుదల తేదీ ప్రకటించారు.    

PREV
15
`కాంతార 2` రిలీజ్‌ డేట్‌.. రిషబ్‌ శెట్టి టార్గెట్‌ ఆ రోజే

రిషబ్‌ శెట్టి హీరోగా రూపొందుతున్న 'కాంతార చాప్టర్ 1' (కాంతార 2) సినిమా విడుదల తేదీ ప్రకటించారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన హోంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కన్నడ మూవీ అయిన `కాంతార` ఆ భాషలోనే కాదు ఇండియాలోని ప్రముఖ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో దీనికి ప్రీక్వెల్‌ని తీసుకువస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

ఇప్పుడు `కాంతార చాప్టర్ 1`కి సంబంధించి చిత్ర బృందం కొత్త అప్డేట్ వచ్చింది. `కాంతార చాప్టర్ 1` సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని నటుడు రిషబ్ శెట్టి స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. `కాంతార చాప్టర్ 1` సినిమా పోస్టర్ చూసిన అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఏడు భాషల్లో విడుదల  చేయబోతున్నట్టు టీమ్‌ ప్రకటించింది. 
 

35

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కుందాపూర్‌లోని సెట్‌లో 60 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యాక్షన్ డైరెక్టర్ టోడర్ లాజరోవ్ యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహిస్తున్నారు. తర్వాత పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. బనవాసి కదంబ కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. 
 

45

‘కాంతార చాప్టర్ 1’ చిత్రంలో VFX పనులు చాలా ఉన్నాయి. హాలీవుడ్‌లో ‘లయన్ కింగ్’ వంటి సినిమాలకు VFX వర్క్ చేసిన ది మిల్, MPC కంపెనీలు ఈ సినిమాకు VFX వర్క్ చేయనున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు రూ.125 కోట్లకు పైగా బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ నిర్మించింది.
 

55
Kantara Movie

రెండేళ్ల క్రితం వచ్చిన `కాంతార` పెద్ద విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.350కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. భారీ స్థాయిలో కలెక్షన్లని ఆశిస్తున్నారు. మరి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. 

Read more: సంక్రాంతి మొనగాడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ టైమ్‌ బరిలోకి దిగిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌కే మతిపోయింది

also read: 80వేల కోట్లకు అధిపతి అయిన హీరో ఎవరో తెలుసా? రామారావు, అక్కినేని, చిరంజీవి వంటి హీరోలంతా ఆయన ముందు జుజూబి

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories