పుష్ప 2 ట్రైలర్ రివ్యూ..పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, 1000 కోట్లు సాధించే బొమ్మ ఇది

First Published | Nov 17, 2024, 6:37 PM IST

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్ర ప్రచార కార్యక్రమాలు గ్రాండ్ గా ప్రారంభం అయ్యాయి. పాట్నా వేదికగా గ్రాండ్ ఈవెంట్ లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగానే పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయింది.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్ర ప్రచార కార్యక్రమాలు గ్రాండ్ గా ప్రారంభం అయ్యాయి. పాట్నా వేదికగా గ్రాండ్ ఈవెంట్ లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగానే పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయింది. సుకుమార్ క్రియేటివిటీ, అల్లు అర్జున్ కష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుష్ప మొదటి భాగంలో కంటే ఇప్పుడు రెండవ భాగంగా పుష్ప రాజ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 

ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందనతో పాటు అనసూయ, సునీల్, రావు రమేష్, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన విలన్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. పుష్ప రాజ్, భన్వర్ షింగ్ షెకావత్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ట్రైలర్ ఎలా ఉంది ? విజువల్స్.. అల్లు అర్జున్ డైలాగ్స్ ఇలా ట్రైలర్ లో హైలైట్ అయిన అంశాలు ఏంటో ఇప్పుడు ట్రైలర్ రివ్యూలో చూద్దాం. 


జగపతి బాబు పాత్రతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. జగపతి బాబు పవర్ లో ఉన్న పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నారు. పుష్ప గురించి ఆరా తీస్తుంటాడు. ఎవుడ్రా వోడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ప్రతి విజువల్ గ్రాండ్ గా కనిపిస్తోంది. పాన్ ఇండియా చిత్రానికి కావలసిన అంశాలని సుకుమార్ బాగా దట్టించినట్లు ఉన్నటు. 

ట్రైలర్ లో ఎక్కువగా డైలాగులు పుష్ప పేరుని ఎలివేట్ చేయడానికే పెట్టినట్లు ఉన్నారు. పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్ అని రష్మిక అంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అంటూ మరో డైలాగ్ ఇలా పుష్ప నామస్మరణ ఎక్కువగా కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలలో భారీగా విజువల్ ఫీస్ట్ అనిపించేలా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. తన చేత్తో గడ్డాన్ని నిమురుకుంటూ తగ్గేదే లే అని చెప్పడం పుష్ప స్టైల్.. ఈసారి శ్రీవల్లి పాదంతో తన గడ్డాన్ని నిమురుకుంటున్నాడు. 

ట్రైలర్ సగంలో ఫహద్ ఫాజిల్ భన్వర్ షింగ్ షెకావత్ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఈసారి ఆయన పాత్రలో కామిక్ టచ్ ఉంటూనే రూత్ లెస్ గా కనిపిస్తున్నారు. ట్రయిలర్ లో అనసూయ, సునీల్ సెకను పాటు కనిపిస్తారు అంతే. వాళ్ళకి ట్రైలర్ లో అంతగా ప్రాధాన్యత దక్కలేదు. 'నాకు రావలసిన పైసా అణా అయినా, అర్థ అణా అయినా.. అది ఏడు కొండలపై ఉన్నా.. ఏడు సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేది పుష్ప గాడి అలవాటు అంటూ బన్నీ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హై లైట్ గా నిలిచింది. 

విజువల్ చూస్తుంటే సముద్రం బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్ అంటూ బన్నీ చెప్పే మరో డైలాగ్ ఆకట్టుకుంటోంది. అంటే పుష్పరాజ్ ఈసారి తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించబోతున్నాడు. ఓవరాల్ గా ట్రైలర్ పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు మరింత పెంచేలా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. ఆ సన్నివేశాలకి తగ్గట్లుగా ఎమోషన్ వర్కౌట్ అయితే ప్రభంజనం గ్యారెంటీ. తెలుగులో మరో 1000 కోట్లు సాధించే బొమ్మగా పుష్ప 2పై ట్రైలర్ తో అంచనాలు పెరుగుతాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని ఎపిసోడ్స్ లో అదిరిపోయింది. 

Latest Videos

click me!