ప్రస్తుతం మన తెలుగు హీరోలకు పాన్ఇండియా రేంజ్లో డిమాండ్ ఉండి. పాన్ ఇండియా హీరో అన్న బిరుదుతో పాటు.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ కూడా దక్కుతోంది. ఈక్రమంలోనే పాన్ఇండియా హీరోలు అందరు 100 కోట్లు దాటి పారితోషికాల విషయంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మన టాలీవుడ్ హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇతర భాషల్లో హీరోలు మనవాళ్లతో పోటీపడలేకపోతున్నారు.
అంతే కాదు మన హీరోల మధ్య కూడా బాక్సాఫీస్ వార్ అంతే పవర్ ఫుల్ గా నడుస్తుంటుంది. అందరు చాలా ఫ్రెండ్లీగానే ఉన్నా.. సినిమా రిలీజ్ ల విషయంలో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతుంటారు. ఇక ఇప్పుడు పారితోషికాల విషయంలో కూడా అదేపోటీ వాతావరణం కొనసాగుతోంది. ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటివారు పాన్ ఇండియన్ స్టార్స్ గా మారారు.
Also Read: త్రిష, ఐశ్వర్యరాయ్, షారుఖ్, సినిమా స్టార్స్ పాస్‌పోర్ట్ ఫోటోలు ఎప్పుడైనా చూశారా..?