రాజమౌళిపై నోరు పారేసుకున్న దర్శన్, కన్నడ హీరో నోటి దురుసు అంతా ఇంత కాదు..

Published : Jul 09, 2024, 10:57 AM IST

ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. వివాదాలు దర్శన్ కు కొత్తేం కాదు. కాంట్రవర్సియల్ కామెంట్స్ తో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వివాదాలు చేసే దర్శన్.. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిపై కూడా నోరు జారాడు. 

PREV
19
రాజమౌళిపై నోరు పారేసుకున్న దర్శన్, కన్నడ హీరో నోటి దురుసు అంతా ఇంత కాదు..

కన్నడ నాట సంచలనంగా మారాడు స్టార్ హీరో దర్శన్. రేణుకా స్వామి అనే అభిమానిని హత్యచేశాడన్న ఆరోపణలతో దర్శన్ తో పాటు అతని ప్రియురాలు.. మరికొంత మంది వ్యక్తులు సెంట్రల్ జైల్ లో ఉన్నారు. కాగా దర్శన్ విషయం అటు కన్నడ పరిశ్రమతో పాటు... సౌత్ సినిమాను కుదిపేస్తోంది. 
 

29

అయితే దర్శన్ కు వివాదాల కొత్త కాదు.. దర్శన్ నోటి దురుసు వల్ల ఎన్నో చిక్కులు కొని తెచ్చుకున్నాడు అని చెప్పాలి. అటు కన్నడ పరిశ్రమతో పాటు..ఇతర పరిశ్రమలపై కూడా దర్శన్ చేసిన కామెంట్లు.. ఆయన చేసిన పనులు జనాల్లో వ్యతిరేకతను కలిగించాయి. అతనితో అనుబంధం ఉన్న కొంత మంది నటులు.. ఆయన్ను అభిమానించే కొంత మంది ఫ్యాన్స్ తప్పించి.. దర్శన్ ను మంచి అనేవారు లేదు. 
 

39

అయితే దర్శన్ కు వివాదాల కొత్త కాదు.. దర్శన్ నోటి దురుసు వల్ల ఎన్నో చిక్కులు కొని తెచ్చుకున్నాడు అని చెప్పాలి. అటు కన్నడ పరిశ్రమతో పాటు..ఇతర పరిశ్రమలపై కూడా దర్శన్ చేసిన కామెంట్లు.. ఆయన చేసిన పనులు జనాల్లో వ్యతిరేకతను కలిగించాయి. అతనితో అనుబంధం ఉన్న కొంత మంది నటులు.. ఆయన్ను అభిమానించే కొంత మంది ఫ్యాన్స్ తప్పించి.. దర్శన్ ను మంచి అనేవారు లేదు. 

49

కన్నడ నాట ఎన్నో వివాదాలు మూటగట్టుకున్నాడు దర్శన్. హీరోయిన్లతో అఫైర్స్.. కొంత మందిని హెరాజ్ చేయడంతో పాటు.. దురుసు ప్రవర్తన, దర్శకులు, నిర్మాతలతో కూడా దర్శన్ కు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈక్రమంలో దర్శన్ టాలీవుడ్ పై కూడా రెండు మూడు సార్లు తన అక్కసు వెళ్ళగక్కాడు గతంలో. 
 

59

సలార్ రిలీజ్ టైమ్ లో కూడా ఇలానే నోరు జారాడు దర్శన్. సలార్ టైమ్ లో దర్శన్ కంటీర రిలీజ్ కు రెడీగా ఉంది. మరి అంత పెద్ద సినిమా ఉంది కదా మీ సినిమా రిలీజ్ చేస్తారా అని అడిగితే.. దర్శన్ ఏమన్నాడంటే.. తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మేం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది  మన సినిమా, మన ఊరు..  ఎవరికో భయపడి మనం ఎందుకు దూరంగా పారిపోవాలి. మన ఇంటికి రావాలంటే.. వాళ్లకు భయముండాలి. మనకు ఎందుకు భయం అని అన్నారు. 

69

అంతే కాదు  ఇలా బయట నుంచి  సినిమాలు రాబట్టి.. కన్నడ నాటలో ఉ‍న్నానో.. లేదో అన్న భయం వేస్తోంది. అసలు సినిమా బాగుంటే కన్నడ ప్రేక్షకులే ఆధరిస్తారు...కథ నచ్చితే.. మన  చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళతారు.  అందు కోసం ఎక్కడి నుంచో దిగిరానక్కర్లేదు.. ప్యాన్‌ ఇండియా ఇమేజ్ కూడా అక్కర్లేదు అన్నారు దర్శన్. ఇలా సలార్ పై గట్టిగా అక్కసు వెళ్ళగగ్గారు. 
 

79

అంత మొనగాడివైతే.. అంత గొప్ప సినిమాలు చేసి చూపించు..నీ సినిమాలు ఆస్కార్ రేంజ్ కు వెళ్లాయా.. కనీసం స్టేట్ అవార్డ్ అయిన సాధించావా.. ఇలా జలసీని లోపల పెట్టుకుని.. తెలుగు దర్శకుడిపూ ఇలా అక్కసు వెళ్లగక్కడంతో.. సొంత పరిశ్రమ నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు దర్శన్. 

89

ఇక ఇంతకు మందు దర్శకదిగ్గజం రాజమౌళి గురించి కూడా నోరు జారాడు దర్శన్. రాజమౌళిని అందరు అద్భుతం.. అదరహో.. గొప్ప దర్శకుడు అంటుంటారు.. ఆయనలో గొప్పేముంది.. ఆయనేమి ఎక్ట్రార్డనరీ దర్శకుడేమి కాదు.. ఆయన కూడా అందరిలా సాధారణ దర్శకుడు మాత్రమే అని అన్నాడు దర్శన్. తెలుగు సినిమాతో పాటు ఇండియాన్ సినిమా గౌరవాన్ని హాలీవుడ్ లో నిలబెట్టిన రాజమౌళిని దర్శన్ గతంలో ఈ మాట అన్నాడు. దాంతో దర్శన్ పై గట్టిగా ట్రోలింగ్ నడించింది. 

99

ఇక కన్నడనాట కూడా దర్శన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు.. అదృష్టదేవతను గదిలోకి తీసుకెళ్లి నగ్నంగా చేస్తానని అనడంతో పాటు.. శృంగారంపై దర్శన్ చేసిన కామెంట్స్  అన్నీ ఇన్నీ కావు. ఇవన్ని ఆ నటుడిపే వ్యతిరేకతను పెంచాయి. కాని  సుమలత లాంటి సీనియర్ నటీమణి మాత్రం దర్శన్ కు సపోర్ట్ గా నిలవడం ఆశ్చర్యకరమైన విషయం. 
 

Read more Photos on
click me!

Recommended Stories