బ్రేకింగ్: కంగువా ఎడిటర్ అనుమానాస్పద మృతి, షాక్ లో హీరో సూర్య!

First Published Oct 30, 2024, 10:11 AM IST

శివ దర్శకత్వంలో సూర్య నటించిన కంగువా సినిమాకి ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ ఈరోజు ఉదయం హఠాన్మరణం చెందారు.

నిషాద్ యూసుఫ్, బాబీ డియోల్, సూర్య


నటుడు సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువా. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. కంగువా నవంబర్ 14న విడుదల కానుంది. కంగువా సినిమా ప్రమోషన్ పనులు జరుగుతున్న తరుణంలో, ఆ సినిమాకు పనిచేసిన ప్రముఖుడి మరణం చిత్ర బృందాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. కంగువా సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ ఈరోజు ఉదయం మరణించారు. ఆయన వయసు 43.

నిషాద్ యూసుఫ్ మృతి

నిషాద్ యూసుఫ్ కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో విగత జీవుడై కనిపించాడు. నిషాద్ యూసుఫ్ కంగువాతో పాటు ఆర్.జే.బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించనున్న కొత్త సినిమాకి కూడా ఎడిటర్‌గా ఎంపికయ్యారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన హఠాన్మరణం కంగువా చిత్ర బృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిషాద్ యూసుఫ్ మలయాళ చిత్రాలకు కూడా ఎడిటర్ గా పని చేస్తున్నారు. 

Latest Videos


ఆర్‌జే బాలాజీ, నిషాద్ యూసుఫ్

మలయాళంలో టొవినో థామస్ నటించిన తల్లుమల సినిమాకు నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా పని చేశారు. ఈ మూవీతో ఆయన పాపులారిటీ రాబట్టారు. ఈ సినిమాకి ఆయనకు కేరళ ప్రభుత్వం రాష్ట్ర అవార్డు కూడా ఇచ్చింది.  ప్రస్తుతం మోహన్‌లాల్ నటిస్తున్న బసూకా అనే మలయాళ సినిమాకి నిషాద్ యూసుఫ్   ఎడిటర్‌గా పనిచేస్తున్నారు . ఆయన హఠాన్మరణం మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

నిషాద్ యూసుఫ్, శివ, సూర్య

కొన్ని రోజుల క్రితం చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కంగువా సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్‌లో నిషాద్ యూసుఫ్ పాల్గొన్నారు. అప్పుడు సూర్య, నటుడు బాబీ డియోల్‌తో సెల్ఫీ దిగి సంతోషించిన నిషాద్ యూసుఫ్ ఈరోజు ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

Nishadh Yusuf

మరో రెండు వారాల్లో కంగువా విడుదల కాగా ఎడిటర్ మరణం హీరో సూర్యకు షాక్ ఇచ్చింది. నిషాద్ యూసుఫ్ కెరీర్ ఏషియా నెట్ న్యూస్ లో ఎడిటర్ గా మొదలైంది. అనంతరం ఆయన మూవీ ఎడిటర్ గా మారాడు. దర్యాప్తు పూర్తి అయితే కానీ నిషాద్ మరణానికి కారణాలు తెలియనున్నాయి. 

click me!