మహేష్ కోసం ఎర్రటి ఎండలో కెన్యా అడవుల్లో చక్కర్లు కొడుతున్న రాజమౌళి, ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ 

First Published Oct 30, 2024, 8:36 AM IST

మహేష్ బాబు మూవీని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. ఆయన ఎర్రటి ఎండలో అక్కడి అడవుల్లో సంచరిస్తున్నారు. 
 

ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబుకు చాలా ప్రత్యేకం. ఇది ఆయన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అదే సమయంలో రాజమౌళితో మొదటిసారి చేతులు కలిపారు. గతంలో వీరిద్దరూ కలిసి మూవీ చేసింది లేదు. బాహుబలి కంటే ముందే మహేష్ బాబుతో రాజమౌళి మూవీ చేయాల్సి ఉందట. ఏళ్ల తరబడి ఈ కాంబినేషన్ వాయిదా పడుతూ వచ్చింది. 

ఆర్ ఆర్ ఆర్ వంటి గ్లోబల్ మూవీ అనంతరం మహేష్ తో మూవీ సెట్ కావడం కూడా చెప్పుకోదగ్గ విషయం. ఆర్ ఆర్ ఆర్ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రపంచ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ సైతం కొనియాడారు. 

ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబి 29ని రాజమౌళి వరల్డ్ క్లాస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి 2 ఏళ్ల సమయం పట్టిందని రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. సాధారణంగా రెండు మూడు నెలల్లో స్క్రిప్ట్ పూర్తి చేస్తాము. ఎస్ఎస్ఎంబి స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి మాకు రెండేళ్ల సమయం పట్టిందని ఆయన అన్నారు. 
 

Latest Videos


Rajamouli


ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఇండియానా జోన్స్ తరహాలో మూవీ ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పడం విశేషం. జంగిల్ అడ్వెంచర్ డ్రామా కావడంతో రాజమౌళి లొకేషన్స్ వేటలో పడ్డాడు. ప్రస్తుతం ఆయన కెన్యా దేశంలో ఉన్నారు. అంబోసెల్లి నేషనల్ పార్క్ లో వైల్డ్ సఫారీ చేస్తున్నారు. ఎర్రటి ఎండలో జంతువుల మధ్య కాలినడకన సంచరిస్తున్న రాజమౌళి ఫోటో వైరల్ అవుతుంది. 

రాజమౌళి ఈ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అద్భుతమైన ఫారెస్ట్ లొకేషన్స్ ఎస్ఎస్ఎంబి 29 కొరకు రాజమౌళి అన్వేషిస్తున్నారని తెలుస్తుంది. ఎస్ ఎస్ఎం బి 29 విజువల్ వండర్ లా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా జనవరిలో మూవీ చిత్రీకరణ మొదలుపెట్టాలనేది రాజమౌళి ఆలోచన. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. 

ప్రస్తుతానికి లొకేషన్ వేటలో ఉన్నాడు. మరోవైపు మహేష్ బాబు లుక్ ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. అంత పొడవుగా జుట్టు, గడ్డం మహేష్ బాబు పెంచింది లేదు. ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ లుక్ ఎలా ఉండాలో రాజమౌళి డిసైడ్ చేశాడు. దానిలో భాగంగా మహేష్ బాబు జుట్టు పెంచుతున్నారు. 


యుద్ధ విద్యల్లో కూడా మహేష్ బాబు సాధన చేశాడట. రాజమౌళి తన హీరోలను మామూలుగా ఇబ్బంది పెట్టడు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో నటించిన ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్ చెమటోడవాల్సి వచ్చింది. రాజమౌళితో మూవీ అంటే కష్టపడక తప్పదు. ఇక మహేష్ బాబుకు విలన్ అంటూ పలువురు స్టార్ హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

కోలీవుడ్ స్టార్ విక్రమ్, మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ కోసం రాజమౌళి సంప్రదించాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక తన ప్రతి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి మీడియా ముందుకు వస్తారు. ఆసక్తికర సంగతులు పంచుకుంటారు . సంక్రాంతికి మహేష్ బాబు , రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, నిర్మాతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారట. 

click me!