గోపిచంద్, శ్రీనువైట్ల ‘విశ్వం’OTT స్ట్రీమింగ్ డిటేల్స్

First Published | Oct 30, 2024, 7:59 AM IST

గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన 'విశ్వం' సినిమా మిశ్రమ స్పందనలను అందుకుంది. మార్నింగ్ షోకే యావరేజ్ టాక్ రావడంతో ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ దీపావళికి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

Gopichand, Srinu vytla, Viswam , OTT,


గోపీచంద్‌ సినిమాలు  గత కొంత కాలంగా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటంలేదు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పడుతూ  వస్తోంది. మరో ప్రక్క శ్రీనువైట్ల దూకుడు తర్వాత ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. పదేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతూనే ఉన్నాయి. అయినా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలో గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల 'విశ్వం' ను రూపొందించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

Gopichand, Srinu vytla, Viswam, Review,


గతంలో తాను చేసిన తప్పులను సరిదిద్దుకుని ఈ సినిమాను రూపొందించా అంటూ ప్రమోషన్ సమయంలో గట్టిగా చెప్పుకొచ్చారు. అలాగే విశ్వం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని  ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. అయితే రిలీజ్ అయ్యాక ఆ స్పీడు తగ్గిపోయింది. మార్నింగ్ షోకే యావరేజడ్ టాక్ వచ్చేసింది. ఓపెనింగ్‌ కలెక్షన్స్ ఓ మాదిరిగా వచ్చాయి. సినిమా అస్సామే అన్నారు. 


Gopichand, Srinu vytla, Viswam, OTT,

ట్రైన్ కామెడీ ని రవితేజ వెంకీ స్దాయిలో అన్నారు. కాకపోతే ఆ కాలం నాటి జోక్ లు, పంచ్ డైలాగులతోనే నింపేసారు. కేవలం వెన్నెల కిషోర్ మాత్రమే నవ్వించాడు. మిగతా కామెడీ యాక్టర్స్ కు ఆ మాత్రం ఫన్ కూడా క్రియేట్ చేయలేక చేతులు ఎత్తేసారు.  ఏదైమైనా ఫస్టాఫ్ ని ఫృధ్వీ కామెడీ, ఇంటర్వెల్ బ్లాక్  ఎంతో కొంత కాంపన్సేట్ చేసింది.

సెకండాఫ్ లో ఆ మాత్రం కూడా లేకుండా పోయింది. హీరో ఫ్లాష్ బ్యాక్ , క్లైమాక్స్ లో హీరో,విలన్స్ మధ్య డైలాగ్స్ ఏంటో శ్రీను వైట్ల ఛాదస్తం  అనిపిస్తుంది.  అయితే ఉన్నంతలో కామెడీ బాగుందని టాక్ రావటంతో జనం  ఓటిటి కోసం ఎదురుచూడటం మొదలెట్టారు.  
 

Viswam movie Review


ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ విషయం బయిటకు వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ వాళ్లు తీసుకున్నారు. ఈ సినిమాని దీపావళి శెలవు కలిసొచ్చేలా స్ట్రీమింగ్ చేయబోతున్నారనే టాక్ బయిటకు వచ్చింది. అమేజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ ని 12 కోట్లుకు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓటిటి రిలీజ్ విషయమై ఇంకా అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది. ఈ రోజు రావచ్చు అని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 

Viswam movie Review


కథేంటి
 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖురేషి (డిష్ సెన్ గుప్తా) హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. అతడికి వెనక నుంచి  సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు బాచి రాజు (సునీల్) హెల్ప్ చేస్తూంటాడు. ఈ విషయం మినిస్టర్ (సుమన్) కు తెలియడంతో ఇద్దరు కలిసి అతన్ని చంపేస్తారు.అయితే ఇప్పుడా హత్యను  ఒక పాప చూస్తుంది. దాంతో మీరు ఊహించినట్లుగానే  ఆ పాపను చంపాలని టెర్రరిస్ట్ మనుషుల్ని పంపిస్తాడు.

అప్పుడు మన హీరో  గోపి అలియాస్ విశ్వం (గోపీచంద్) రంగంలోకి దూకి  ఆ పాప ప్రాణాలు కాపాడుతాడు. అప్పటినుంచి ఆ పాపకు అంగరక్షకుడిగా మారతాడు. మారుపేర్లతో ఆ పాప ఇంట్లో చేరుతాడు. అయితే ఆ పాపను క్యాజువల్ గా రక్షించాడా..కావాలనే వేరే కారణంతో రక్షించాడా..అసలు నిజానికి విశ్వం ఎవరు...టెర్రరిస్ట్ లు అసలు లక్ష్యం ఏమిటి... ఆ పాపను విశ్వం కాపాడాడా లేదా..? అలాగే  సమైరా (కావ్య థాపర్) కు ఈ కథలో పాత్ర ఏమిటి..?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Latest Videos

click me!