నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది.
నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది.
26
కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. కంగనా రనౌత్ ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలపై, ప్రస్తుతం రాజకీయాలపై కంగనా రనౌత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు.
36
ఇదిలా ఉండగా కంగనా కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. చాలా మంది సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. కానీ కంగనా మాత్రం ఆధ్యాత్మిక బాట పట్టింది.
46
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కంగనా శ్రీకాళహస్తిని సందర్శించింది. అక్కడ ఆలయంలో కంగనా రాహు కేతు పూజ నిర్వహించింది. ఆ ఫోటోలని కంగనా రనౌత్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
56
పూజలు చేసే సమయంలో తాను భగవంతుడిని ఏమని ప్రార్థించానో వివరించింది కంగనా. నా శత్రువుల నుంచి దయ పొందాలి, కొత్త సంవత్సరం పోలీస్ కేసులు తక్కువగా ఉండేలా, లవ్ లెటర్స్ ఎక్కువగా వచ్చేలా ఆశీర్వదించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు కంగనా పేర్కొంది.