Ramcharan Teja: అప్పట్లో రామ్ చరణ్ కు హీరోయిన్ గా కంగనా? , లాస్ట్ మినిట్ లో కాన్సిల్

Published : Feb 19, 2025, 01:10 PM IST

 Ramcharan Teja:  తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే అంతకు ముందే ఆమెకు రామ్ చరణ్ సరసన అవకాశం వచ్చిందని తెలుసా...ఆ వివరాలు ఇక్కడ చదవండి

PREV
13
 Ramcharan Teja: అప్పట్లో రామ్ చరణ్ కు హీరోయిన్ గా కంగనా? , లాస్ట్ మినిట్ లో కాన్సిల్
Kangana Ranaut is the first choice for Ram Charan second movie? in telugu

 Ramcharan Teja:  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్  అంటేనే ఇప్పుడు ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతోంది. అయితే ప్రారంభం రోజుల్లో కాస్తంత సైలెంట్ గానే ఉండేది.

 ఆమె గ్లామర్ క్వీన్ గా వెలిగింది. దాంతో ఆమెకు తెలుగు నుంచి నిర్మాతలు, దర్శకులు ఎప్రోచ్ అయ్యారు. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే ఆమెను రామ్ చరణ్ సినిమా కోసం కూడా ఎప్రోచ్ అయ్యారనే విషయం తెలుసా.

23
Kangana Ranaut is the first choice for Ram Charan second movie? in telugu


డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో కంగనా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రసంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. హిందీలో క్వీన్, మణికర్ణక, తను వెట్స్ మను వంటి చిత్రాలతో స్టార్ డమ్ అందుకుంది.

ఈ క్రమంలోఆమెకు తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత చేసారు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజమౌళితో సినిమా మగధీర ప్లాన్ చేసారు. ఆ సినిమాలో మొదట కంగనా రనౌత్ అని అనుకున్నారు. అప్పటికే బాలీవుడ్ లో ఆమె వెలిగిపోతోంది. దాంతో ఆమెకు ఈ ఆఫర్ వచ్చింది. 
 

33
Kangana Ranaut is the first choice for Ram Charan second movie? in telugu


అయితే కంగనాని రాజమౌళి టీమ్ ఎప్రోచ్ అవటం జరిగిందిట. అయితే ఆమె వరస బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండటం, తెలుగు వంటి రీజనల్ లాంగ్వేజ్ లో అదీ కొత్త కుర్రాడి సరసన చేయటానికి పెద్దగా ఉత్సాహం చూపించలేదని వినికిడి.

దానికి తోడు ఆమె కెరీర్ ప్రారంభంలోనే వివాదాల్లో ఇరుక్కోవటం కూడా రాజమౌళికి, రామ్ చరణ్ తండ్రికి నచ్చలేదట. ఆమెను పెట్టుకున్న తర్వాత తమ సినిమాకీ సమస్యలు వస్తే ఏంటనే ప్రశ్న ఉదయించిందట. లేకపోతే ఆమె మగధీరలో కాజల్ అగర్వాల్ చేసిన పాత్ర చేయాల్సింది. తెలుగులో నెక్ట్స్ లెవిల్ లో ఆమె క్రేజ్ ఉండేది. 

Read more Photos on
click me!

Recommended Stories