Akhanda2: ‘అఖండ 2’కి బాలయ్యకి అంత పే చేస్తున్నారా?

Published : Feb 19, 2025, 12:02 PM IST

Akhanda2: 'అఖండ 2' చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది. మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ ఫుల్ గా ఈ క్యారక్టర్ బోయపాటి డిజైన్ చేసినట్లుగా టాక్ ఉంది. 

PREV
13
Akhanda2: ‘అఖండ 2’కి బాలయ్యకి  అంత పే చేస్తున్నారా?
Balakrishna hikes remuneration for #Akhanda2 in telugu


Akhanda2: కోవిడ్ కు ముందు వరకూ వరుస ప్లాప్స్ తో సతమతమైన బాలయ్య.. 'అఖండ' తర్వాత వరరస హిట్స్ ఇస్తున్నారు.  బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఆయన నటించే చిత్రాలు వరుసగా విజయాన్ని అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 'భగవంత్ కేసరి' 'వీర సింహా రెడ్డి' 'డాకు మహారాజ్' సినిమాతో హిట్లు అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ నాలుగు సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరిన  ఈ సీనియర్ హీరో ఇప్పుడు 'అఖండ 2' చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు.  ఈ నేపధ్యంలో ఆయన ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

23
Balakrishna hikes remuneration for #Akhanda2 in telugu


'అఖండ 2' చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది. మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ ఫుల్ గా ఈ క్యారక్టర్ బోయపాటి డిజైన్ చేసినట్లుగా టాక్ ఉంది.  

ఈ క్రమంలో అఖండ 2 కోసం బాలయ్య తన రెమ్యునరేషన్‌ను రూ.28 కోట్ల నుంచి ఏకంగా రూ.7 కోట్ల మేర పెంచి రూ.35 కోట్లుగా తీసుకుంటున్నాడని సమచారం. ఈ పెంచిన రెమ్యునరేషన్ నుంచే ఆయన థమన్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి.  

33
Balakrishna hikes remuneration for #Akhanda2 in telugu


శివ తత్త్వం, హిందూ దేవుళ్ళు, దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'అఖండ' చిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి శ్రీను. అప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేసారు. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, 'అఖండ 2: తాండవం' చిత్రాన్ని యూనివర్సల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు.

 ఇప్పటికే  బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన నుదిటిన నామాలు, మెడలో పెద్ద రుద్రాక్ష మాలలతో అఘోరా గెటప్ లో ఉన్నారు. సెట్స్ లో దిగిన ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్.. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అఖండ రుద్ర సికిందర్ ఘోరా తాండవం చూడబోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.
   

Read more Photos on
click me!

Recommended Stories