RC 16: రామ్ చరణ్-జాన్వీ కపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

Published : Feb 19, 2025, 12:19 PM IST

రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ నటించిన RC 16 సినిమా   విడుదల తేదీ ఫిక్సైనట్లు  ట్రేడ్ వర్గాల సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

PREV
13
RC 16: రామ్ చరణ్-జాన్వీ కపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?
RC 16 : Ram Charan-Janhvi Kapoor movie release date fixed in telugu


 
RC 16:  రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌. Rc 16 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో రూపొందుతోంది.

 రామ్‌ చరణ్ హీరోగా ఇటీవల వచ్చిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన అభిమానులు Rc 16పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అయితే అఫీషియల్ గా కాదు. 
 

23
RC 16 : Ram Charan-Janhvi Kapoor movie release date fixed in telugu


'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు రెండో సినిమానే రామ్‌ చరణ్‌తో చేసే అవకాశం దక్కించుకున్నారు. ఉప్పెన వచ్చి చాలా కాలం అయినా స్టార్‌ హీరోతో సినిమాను చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్‌ చేశారు. ఇప్పటికే చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ పట్టాలెక్కింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 16న థియేటర్స్ లో సందడి చేయబోతుంది అన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్స్ తో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేసి హిట్ కొట్టాలని రామ్ చరణ్ భావిస్తున్నారు.  బుచ్చిబాబు అందుకు తగ్గట్లుగా జెట్‌ స్పీడ్‌తో ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారని టీం మెంబర్స్ ద్వారా సమాచారం అందుతోంది.

33
RC 16 : Ram Charan-Janhvi Kapoor movie release date fixed in telugu


రామ్ చరణ్‌ను రంగస్థలంలోని చిట్టిబాబు తరహా పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు చూపించబోతున్నారని అంటున్నారు.  అలాగే  విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడిక్‌ కథతో ఈ సినిమా రూపొందుతోంది.  స్క్రిప్ట్‌ పై చాలా కాలం వర్క్ చేయడం ద్వారా అద్భుతంగా వచ్చిందని సమాచారం అందుతోంది.

'RC 16' సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొదలు అయ్యింది. దీని కోసం నగర శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్ ను నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో భారీగా ఖర్చు చేసి ఈ సెట్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

పీరియాడిక్‌ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. దీనికి తగ్గట్టుగానే ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ని నిర్మించారు. రామ్ చరణ్ తో సహా ఇతర ప్రధాన నటీనటులు పాల్గొనే ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నైట్ షూట్ కూడా జరగిందని టాక్.
 

Read more Photos on
click me!

Recommended Stories