తమిళంలో “కల్కి” బిజినెస్, ఎంతొస్తే బ్రేక్ ఈవెన్? కమల్ ని నమ్ముకునేనా?

First Published Jun 20, 2024, 2:01 PM IST

తమిళంలో శ్రీ లక్ష్మీ మూవీస్ వారు కల్కి చిత్రం తమిళ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. వారు గతంలో పుష్పను భారీ ఎత్తున రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. 

Kalki 2898 AD


ఇంకో వారం రోజుల్లో కల్కి చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు. ఈ నేపధ్యంలో  ఏయే భాషల్లో ఎవరి ఇమేజ్ తో ఈ సినిమా ముందుకు వెళ్తుందనే చర్చ మొదలైంది.


తెలుగుకు వచ్చేసరికి ప్రభాస్ ఒక్కడు చాలు, మిగతా వాళ్లను పట్టించుకోరు. దానికి తోడు తెలుగులో ప్రతిష్టత్మకమైన బ్యానర్, మహానటి వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు కావటం సరిపోతుంది. అదే నార్త్ సైడ్ కూడా ప్రభాస్ కు బాహుబలి,సాహో చిత్రాలతో బోలెడు ఇమేజ్ వచ్చింది. అలాగే దీపికా పదుకోని, దిశా పటాని, అమితాబ్ వంటి మహానటుడు ఉండటం ప్లస్ అవుతోంది. ఇక తమిళంలో ప్రభాస్ కన్నా కూడా  కమల్ కు క్రేజ్ ఎక్కువ.
 


తమిళంలో శ్రీ లక్ష్మీ మూవీస్ వారు కల్కి చిత్రం తమిళ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. వారు గతంలో పుష్పను భారీ ఎత్తున రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. దాంతో వారికే ఈ కల్కి రైట్స్ ఇచ్చారు. బాహుబలి తర్వాత తమిళంలో తెలుగు భారీ చిత్రాలకు కాస్త డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రభాస్ గత చిత్రాలు సలార్, ఆదిపురుష్ రెండు కూడా తమిళనాట నిరాశ పరిచాయి. ఆదిపురుష్ చిత్రం అక్కడ 5 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. సలార్ అయితే దాదాపు 20 కోట్లు దాకా గ్రాస్  వచ్చింది. అంటే షేర్ పది నుంచి 12 మధ్య వచ్చినట్లు.  ఏదైమైనా అక్కడ కొన్న రేట్లకు సరపడా రెవిన్యూ రాలేదు. 
 


ఈ క్రమంలో కల్కి చిత్రం బ్రేక్ ఈవెన్ 22 కోట్లుగా ఫిక్స్ చేసారు. అంటే గ్రాస్ 40 కోట్లు దాకా రావాలి. దాంతో ప్రభాస్ మీద కన్నా అక్కడ బిజినెస్ కమల్ ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తున్నారు. కమల్ సినిమాకు వచ్చే ఓపినింగ్స్, కలెక్షన్స్ మామూలుగా ఉండవు కాబట్టి ఖచ్చితంగా కల్కికు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. అయితే తమిళం వారు మొదట నుంచి తెలుగు సినిమాలను చిన్న చూపు చూస్తూ వస్తున్నారు. అదొక్కటే డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెడుతున్న అంశం.  
 


అయితే కమల్ ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ తో ఉన్నారు. నిన్న జరిగిన  ఈవెంట్ లో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డినరీగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్.పైకి సాధారణంగా కనిపించే వారంతా అసాధారణమైన పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ తో కాసేపు మాట్లాడగానే అతని టాలెంట్ ఏంటనేది తెలిసిపోతుంది. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి ఉంది.
 


 ఇందులో బ్యాడ్ మ్యాన్ గా కనిపిస్తాను. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నా పాత్రని నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు. నా లుక్ కోసం చాలా రీసెర్చ్ చేశాం. ఆడియన్స్ నా పాత్రని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.


అలాగే కల్కి చిత్రం స్టార్ట్ అయ్యే ముందు ఎంతో ఆసక్తిగా ఉన్నా, అప్పుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. ఇప్పుడు విస్మయంలో ఉన్నా అని అన్నారు. కమల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కనిపించనున్నారు.  
 


 కంటెంట్ విషయానికి వస్తే... కల్కి 2898 AD’ కథ మహాభారతం నుండి మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఏ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. అతి తక్కువ సినిమాలతోనే అతి పెద్ద స్టార్ డైరక్టర్ గా ఎదిగిన నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు  సినిమాపై ఉన్న అంచనాలు.. నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయనటంలో సందేహం లేదు.  
 

 ‘ఈ భూమిలో మొదటి నగరం, చివరి నగరం కాశీ. పైన నీరు ఉంటుందట. భూమి పై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుంది’ అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు.ట్రైలర్ చూసిన వారంతా వావ్ అనే ఒకే ఒక పదం వాడుతున్నారు. టిక్కెట్ బుక్కింగ్స్ ప్రారంభమైన ఓవర్ సీస్ లో టిక్కెట్ సేల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక 40 శాతం పెరిగాయని తెలుసింది. ఈ క్రమంలో ఈ సినిమాని గురించిన ప్రతీ అంశం ఆసక్తికరమే. 


ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సూపర్ హీరోగా చూపించారు. అలాగే బరో వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాలో అద్భుతమైన ఫైట్స్‌ని కంపోజ్ చేశారని ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది.  ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో స్టార్ నటీనటులు కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ గెస్ట్  పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ పాత్ర మాత్రం కేవలం క్యామియో రోల్ కాదని తెలుస్తోంది.  
 


ట్రైలర్‌లోనే దర్శకుడు దాదాపు స్టోరీ లైన్ చెప్పేశాడు. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే ప్రాంతం కాంప్లెక్స్. అక్కడికి వెళ్లాలని ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన బౌంటీలను సంపాదించే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన డీల్స్ ను పూర్తి చేస్తుంటాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీపికాను తీసుకురావాలన్న డీల్ పై హీరో బయలుదేరుతాడు. ఆమెను కాపాడుతున్న అమితాబ్ (అశ్వథామ)తో భైరవ యుద్ధం చేస్తాడు. అలాగే ట్రైలర్ లో చిన్నపిల్లవాడు అమితాబ్ తో మాట్లాడుతూ కనిపించాడు. బహుశా అతనే కల్కి అయ్యే అవకాశం ఉంది. 
 

Kalki 2898 AD Trailer


కల్కిని చెడ్డవారి చేతుల్లో పడకుండా అశ్వథామ కాపాడుతుంటాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను భైరవ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా తనకు తెలియని ఓ పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. ట్రైలర్‌ను మనం క్షుణ్ణంగా గమనిస్తే ఇదే కథ మనకు కనిపిస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్, అమితాబ్ , దీపికా పాత్రలు హైలైట్ కానున్నాయి. అలాగే కమల్ హాసన్ ను కూడా మాములు మానవుడిగా చూపించలేదు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసం భారీగా ఖర్చు చేశారు. 


నాగ్ అశ్విన్  మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 

Latest Videos

click me!