'భారతీయుడు-2 ' కు నెట్ ప్లిక్స్ భారీ షాక్, ఎన్ని కోట్లు నష్టం అంటే ...?

First Published | Aug 4, 2024, 10:14 AM IST

 ఇండియన్ 2 రైట్స్ ని అన్ని లాంగ్వేజ్ లకు కలిపి రికార్డ్ ఎమౌంట్ కు అంటే 120 కోట్లకు నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. 

Indian 2


 కమల్‌హాసన్‌- ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు-2’. జులై 12న ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్  తెచ్చుకున్న సంగతి తెలిసి్ందే.   ఈక్రమంలో మౌత్ టాక్ వచ్చేక థియేటర్ కు వెళ్లి చూద్దామనుకున్న వాళ్లు సైతం ఆగిపోయారు. ఎలాగో కొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ నుంచి ఓటిటికు షిప్ట్ అయ్యిపోతుంది కదా అక్కడ చూద్దామని  స్ట్రీమింగ్ కోసం మాత్రం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా ఆగ‌స్టులో స్ట్రీమ్ అవుతుంద‌నే వార్త‌లు వచ్చాయి. ఈ సినిమా మంచి డీల్ కే అమ్ముడుపోయిన‌ట్లు కూడా చెప్పుకున్నారు. అయితే, డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కానీ ఈ లోగా ఓటిటి విషయమై ఓ నెట్ ప్లిక్స్ భారీ షాక్ ఇచ్చిందని సమాచారం.

Indian 2


తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ... కమల్, శంకర్ కాంబినేషన్ ,సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావటంతో ఇండియన్ 2 రైట్స్ ని అన్ని లాంగ్వేజ్ లకు కలిపి రికార్డ్ ఎమౌంట్ కు అంటే 120 కోట్లకు నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. ఇది చాలా పెద్ద ఎమౌంట్. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ముందుకు వెళ్లారు. అలా జరిగితే రికవరీ నెట్ ప్లిక్స్ కు చాలా ఈజిగా అయ్యేది.  కానీ ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవటంతో నెట్ ప్లిక్స్ వారు ఇండియన్ 2 నిర్మాతలతో మీటింగ్ పెట్టి కొత్త రేటుకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం.



ఇప్పుడు ఫైనల్ గా నెట్  ప్లిక్స్ వారు 70 కోట్లుకు మాత్రమే ఈ సినిమా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 50 కోట్లు కోత పెట్టారన్నమాట. మొదట్లో ఈ సినిమా డిజిటల్ రైట్స్ నిమిత్తం కొంత ఎమౌంట్ నెట్ ప్లిక్స్ వారు పే చేసారు. అది పోను మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తారు. దానికి నిర్మాత ఒప్పుకుందని తమిళ సిని వర్గాల సమాచారం.
 


ఎగ్రిమెంట్ రాసుకునేటప్పుడు సినిమా రిజల్ట్ ని బట్టి రిలీజ్ డేట్, ఎమౌంట్ ల విషయంలో మార్పులు ఉంటాయని చెప్పిన విషయం గుర్తు చేస్తున్నారు. దాంతో భారతీయుడు 2 నిర్మాతకు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అయ్యింది. ఈ విషయం తేలితే కానీ ఓటిటి డేట్ పై క్లారిటీ రాదు.

అలాగే ఇప్పుడా ఇంపాక్ట్ భారతీయుడు 3 మీద కూడా పడనుంది. దానికు ఎక్కువ రేట్లు రావు. థియేటర్ బిజినెస్ కూడా అంతంత మాత్రమే అన్నట్లు ఉంటుంది. ఇక  28 ఏళ్ల క్రితం ఇదే కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్‌. సిద్దార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.  అయితే ఊహించని విధంగా  చిత్రానికి మొదటిరోజే భారీ ఫ్లాప్‌ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా శంకర్‌పై విమర్శలు వెలువెత్తాయి. కంటెంట్‌ లేకుండా భారీగా ఖర్చుపెట్టారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది అంటూ కమల్‌ అభిమనులతో పాటు సగటు ఆడియన్స్‌ కూడా నిరాశ చెందారు. 
 


 రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చ్రితంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
 

Latest Videos

click me!