Ilayaraja
మంజుమ్మల్ బోయ్స్ సినిమా నిర్మాతలకు సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. గుణ (1991) సినిమాలో తాను స్వరపరిచిన ఓ పాటను ‘మంజుమ్మల్ బోయ్స్’ సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నందుకుగాను ఇళయరాజా ఈ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్ , షాన్ ఆంటోనీ ల అడ్రస్ లకు ఇళయారాజా ఈ నోటీసులు పంపించారు. ఆ మేటర్ మొత్తానికి సెటిల్ మెంట్ తో క్లోజ్ అయ్యినట్లు తెలుస్తోంది.
కమల్ హాసన్ గుణ సినిమాలోని ‘కణ్మని అన్బోదు కాదలన్’పాటపై చట్టపరమైన, నైతికమైన ప్రత్యేక హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని ఇళయరాజా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే తన అనుమతి లేకుండా ఈ సినిమా పాటను మంజుమ్మల్ బోయ్స్ సినిమాలో వాడుకోవడం నేరమని ఇళయరాజా తెలిపారు. సదరు నిర్మాతలు తన నుంచి అనుమతి తీసుకోవాలని, రాయల్టీ చెల్లించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆయన అలా నోటిసులు పంపటం చాలా మంది తప్పు పట్టారు. కోర్టు ఆ టీమ్ నే సమర్దిస్తుందని అన్నారు. దాంతో ఇళయరాజాని సోషల్ మీడియాలో ఈ వయస్సులో ఇదేం బుద్ది అంటూ సెటైర్స్ వేసారు.
Music Director Ilayaraja
‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys movie) మలయాళ ఇండస్ట్రీలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. నిజ జీవిత సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో గతంలో ఇళయరాజా కంపోజ్ చేసిన ‘గుణ’లోని పాటను వాడారు. ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు. అయితే, తన అనుమతి లేకుండా ఈ హిట్ సాంగ్‌ను వాడుకున్నారని ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా తరఫు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు.
అలాగే ఈ నోటీసులపై స్పందించిన చిత్ర నిర్మాత ఇళయరాజాకి కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. మేము ఆ సినిమా మ్యూజిక్ కంపెనీ నుండి హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే మా సినిమాలో వాడుకున్నాం. ఈ పాటకు ఓనర్లు అయిన శ్రీదేవి సౌండ్స్, పిరమిడ్ సంస్థల నుండి మేము హక్కులు పొందాము.. అని క్లారిటీ ఇచ్చాడు చిత్ర నిర్మాత.
ilayaraja music
అయినా సరే తన వద్ద నుంచి మేధోపరమైన హక్కుల విషయంలో రైట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయినా తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ లీగల్ సమస్య తేలకుండా ఉంటే టెక్నికల్ గా ఈ సినిమా బిజినెస్ విషయాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఓటిటి సంస్దల నుంచి అభ్యంతరాలు వస్తాయి. శాటిలైట్ బిజినెస్, రీమేక్ రైట్స్ అన్ని వరస పెట్టి సమస్యలు గా మారతాయి.
కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవి. అలాంటప్పుడు తమ సినిమాలో ఈ పాటను ఉపయోగించాలంటే హక్కులు పొందాలంటే వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. లేదంటే కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Ilayaraja
ఇవన్నీ ఆలోచించి కోర్టులో ఈ సమస్యను పరిష్కరించుకోవటం కన్నా పర్శనల్ గా ఇళయరాజాని కలిసి సెటిల్ చేసుకోవటం మంచిదనే నిర్ణయానికి ‘మంజుమ్మల్ బాయ్స్’నిర్మాతలు వచ్చారు. ఇళయరాజా 2 కోట్లు నష్టపరిహారంగా కోరారు. అయితే నెగోషియేషన్స్ తర్వాత 60 లక్షలకు దాన్ని ఫైనల్ చేసుకుని ఇళయరాజాకు ఆ ఎమౌంట్ పే చేసి సెటిల్ చేసుకున్నారని NOC తీసుకున్నారని తమిళ సినిమా వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై సమాచారం లేదు.
Ilayaraja
ఇటీవల రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమా టీజర్ లో తన సంగీతాన్ని అనుమతి లేకుండా వాడినట్లు సన్ పిక్చర్స్ సంస్థకు ఇళయరాజా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. మంజుమ్మల్ బాయ్స్ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.