‘భారతీయుడు 2’ కి కొత్త సమస్య...మల్టిప్లెక్స్ అసోసియేషన్ లీగల్ నోటీస్

First Published | Aug 30, 2024, 7:54 AM IST

కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేసిన సరికొత్త చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2).  
 

Indian 2


కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్  సొంతం చేసుకుంది. ఫైనల్ గా నిర్మాతకు భారీ నష్టం మిగిలిస్తూ డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా  ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ లో కూడా రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌  అవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరో కొత్త సమస్య ఎదురైంది.
 

indian 2

 
భారతీయుడు 2 నిర్మాతలకి మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా లీగల్ నోటీసులు పంపించిందని ముంబై మీడియా వర్గాల సమాచారం. ఓటిటి విషయంలో  తాము పాటిస్తున్న నిబంధనను అతిక్రమించి త్వరగా ఓటిటికి ఇవ్వడం వల్ల సంజాయిషీ కోరుతూ లైకా సంస్థకు నోటీసు పంపింది. సినిమా డిజాస్టర్ అవటంతో ముందుగా అనుకున్న తేదీ అనుకున్న తేదీ కన్నా ముందే ఓటిటిలో వచ్చేసింది. 

Latest Videos



అయితే ఇది అక్కడ మల్టిప్లెక్స్ యూనియన్ రూల్స్ కు విరుద్దం. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు ఏవైనా సరే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా 8 వారాల థియేటర్ ఓటిటి గ్యాప్ పాటించాలనేది మల్టీప్లెక్సులు అక్కడి నిర్మాతలతో చేసుకున్న ఎగ్రిమెంట్. ఒకవేళ ఎవరైనా మేము ముందుగా ఓటిటికు వెళ్లిపోతాం , ఈ రూల్ ని పాటించం  అనుకుంటే వాళ్లకు స్క్రీన్లు కేటాయించబడవు. పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్ తదితర కంపెనీలన్నీ ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. 

Indian 2


ఈ క్రమంలో భారతీయుడు  2 మల్టిప్లెక్స్ లకు చెందిన  ఈ క్లాజ్ ని అతిక్రమించి హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో రెండు నెలలు పూర్తి కాకుండానే రిలీజ్ చేయడం పట్ల సదరు సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన ప్రకటించింది. లీగల్ నోటీసు పంపంది. ఇప్పుడు ఈ విషయమై భారతీయుడు 2 చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్ వారు సమాధానం చెప్పుకోవాల్సి  ఉంటుంది. 
 

Indian 2 surprise out director Shankar reveals

చిత్రం కథేంటంటే:

అర‌వింద‌న్ (సిద్ధార్థ్‌), ఆర్తి (ప్రియ భ‌వానీ శంక‌ర్‌) మ‌రో ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి స‌మాజంలో అవినీతి, అన్యాయాల్ని ప్ర‌శ్నిస్తూ సామాజిక మాధ్య‌మాల వేదికగా పోరాటం చేస్తుంటారు. ఒక త‌ప్పు చేసినా దాన్నుంచి త‌ప్పించుకోలేమ‌న్న భ‌యం రావాల‌ని, అందుకు భార‌తీయుడు అలియాస్‌ సేనాపతి (క‌మ‌ల్‌హాస‌న్‌) రావాల్సిందేనని భావిస్తుంది ఈ మిత్ర‌ల గ్రూప్. దీంతో సోషల్ మీడియాలో  విప్ల‌వం మొద‌ల‌వుతుంది. ఆ పిలుపు అందుకున్న సేనాప‌తి స్వదేశంలో అడుగు పెడ‌తాడు. ఇన్నాళ్లూ ఆయ‌న ఎక్క‌డున్నాడు? తిరిగొచ్చిన తర్వాత ఆయ‌న స‌మాజంలో కుళ్లుని క‌డిగేయ‌డం కోసం ఏం చేశాడు? ఆ క్ర‌మంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లేమిటి? ఆయ‌న కోసం కాపు కాసిన సీబీఐ అధికారి ప్ర‌మోద్ (బాబీ సింహా) భార‌తీయుడిని అరెస్ట్ చేశాడా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

click me!