గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ గెలుపునకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అల్లు అర్జున్ నంద్యాలలో తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి గెలుపునకు ప్రచారం చేయటం వారికి నచ్చలేదు. అప్పటి నుండి అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.