నాగార్జునకు తెలియకుండా అమల చేసిన పనికి ఆయన షాక్... పది రోజులు మాట్లాడలేదట, ఇంతకీ ఏం జరిగింది?

అమల మీద భర్త నాగార్జున సీరియస్ అయ్యాడట. ఆమెతో పది రోజులు మాట్లాడలేదట. ఆయనకు తెలియకుండా అమల చేసిన పని ఇందుకు కారణం అట. 
 

నాగార్జున-అమల టాలీవుడ్ బెస్ట్ కపుల్ అనడంలో సందేహం లేదు. మూడు దశాబ్దాలకు పైగా వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు. మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున అనంతరం హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 1992లో అమల-నాగార్జునల వివాహం జరిగింది. వివాహం అనంతరం అమల నటనకు గుడ్ బై చెప్పింది. 
 

అమల-నాగార్జున దంపతులకు అఖిల్ పుట్టాడు. అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి సంగతి తెలిసిందే. అఖిల్ పసిప్రాయంలోనే సిసింద్రీ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఆ మూవీ భారీ విజయం సాధించింది. 2015లో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అఖిల్ కెరీర్ కోసం నాగార్జున, అమల గట్టి ప్రణాళికలే వేస్తున్నారు. 
 


ఇదిలా ఉంటే అమల జంతు ప్రేమికురాలు. ఆమె సోషల్ యాక్టివిస్ట్ కూడాను. రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్. నాగార్జున ఇంట్లో అనేక పెట్ డాగ్స్ ఉన్నాయి. వీటిలో లాబ్రాడర్ అనే కుక్క అంటే నాగార్జునకు అత్యంత ఇష్టం అట. అది నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటుందట. ఇంటికి రాగానే పరుగున నాగార్జున దగ్గరకు వెళ్లిపోతుందట. 
 


ఒకసారి అమల లాబ్రాడర్ ని ట్రైనింగ్ కి పంపిందట. ఈ విషయం నాగార్జునకు చెప్పలేదట. షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన నాగార్జునకు లాబ్రాడర్ కనిపించలేదట. అది ఎక్కడని అమలను అడిగితే... ఒక నెల రోజులు ట్రైనింగ్ కి పంపానని చెప్పిందట. అది విని షాక్  అయిన నాగార్జున అమల మీద ఫైర్ అయ్యాడట. నాకు చెప్పకుండా లాబ్రాడర్ ని ఎందుకు ట్రైనింగ్ కి పంపావు అని కోప్పడ్డాడట. 
 

అమలతో నాగార్జున పది రోజులు మాట్లాడలేదట. తర్వాత లాబ్రాడర్ కి ట్రైనింగ్ ఇప్పించడం ఎంత అవసరమో ఆయన తెలుసుకున్నారట. అప్పుడు అమలతో మాట్లాడారు అట. ఓ సందర్భంలో అమల ఈ విషయం చెప్పుకొచ్చింది. మరోవైపు నాగార్జున వరుస చిత్రాలతో ఫుల్ బిజీ.  ఆయన జన్మదినం పురస్కరించుకుని రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మాస్, ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక నాగార్జున పాత్ర పేరు సైమన్ గా పోస్టర్ లో తెలియజేశారు. 

కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ కూలీ మూవీపై అంచనాలు మరో స్థాయికి చేర్చాయి. కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కుబేర మూవీలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. భవిష్యత్ లో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Latest Videos

click me!