అఫీషియల్: రజినీకాంత్ సినిమాకి నిర్మాతగా కమల్ హాసన్.. 28 ఏళ్ళ తర్వాత 'అరుణాచలం' డైరెక్టర్ తో సూపర్ స్టార్

Published : Nov 05, 2025, 10:15 PM IST

రజినీకాంత్ 173వ చిత్రం కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 28 ఏళ్ళ తర్వాత రజినీకాంత్ అరుణాచలం దర్శకుడితో పనిచేయనున్నారు. 

PREV
15
కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్ మూవీ 

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ అభిమానులకు ఇది బిగ్ సప్రైజ్ మాత్రమే కాదు, హుషారెత్తించే గుడ్ న్యూస్ కూడా. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తదుపరి చిత్రం #Thalaivar173 కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ స్వంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించనున్నారు. ఈ వార్తని కమల్ హాసన్ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించారు. 

25
ఇది కేవలం సినిమా కాదు 

సినీ చరిత్రలో కొత్త అధ్యాయం రాయబోతున్న ఈ ప్రాజెక్ట్, సౌత్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కలయికగా నిలవబోతోంది. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న రజనీకాంత్–కమల్ హాసన్ స్నేహం, పరస్పర గౌరవానికి ఈ చిత్రం ప్రతీక కానుంది. 1979లో ప్రారంభమైన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది తన 44వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, #Thalaivar173 కేవలం సినిమా కాదు.. రజనీకాంత్, కమల్ హాసన్ స్నేహానికి.. లెగసీకి ఒక సెలెబ్రేషన్ అని పేర్కొన్నారు. 

35
28 ఏళ్ళ తర్వాత ఆ డైరెక్టర్ రజినీ రెండోసారి 

ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌తో పాటు ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. రజనీకాంత్ చరిత్రాత్మక స్క్రీన్ ప్రెజెన్స్‌కి సుందర్ సి విజువల్ స్టోరీ టెల్లింగ్ కలయికగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.సుందర్ సి, రజనీకాంత్ కలయిక ఇది రెండవసారి. వీరిద్దరూ 1997లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం అరుణాచలంలో కలిసి పనిచేశారు. ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో పాటు, రజనీకాంత్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ మరోసారి రజినీకాంత్, సుందర్ సి కాంబోలో మూవీ రానుండడం దానిని కమల్ హాసన్ నిర్మిస్తుండడం సినీప్రేక్షకుల్లో ఉత్సాహం రేపుతోంది.

45
భారీ బడ్జెట్ లో మూవీ 

ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా తెరకెక్కుతుందని సమాచారం. తలైవర్ 173లో రజనీకాంత్ పాత్ర గురించి వివరాలు ఇంకా వెల్లడించలేదు కానీ, అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు.

55
సంక్రాంతికి రిలీజ్

#Thalaivar173 చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా 2027 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు లో నటించే నటీనటులు, టెక్నీషియన్లు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories