ఉలగ నాయగన్
తమిళ సినీ లోకంలోనే కాదు, భారతీయ సినీ లోకంలో కూడా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్, 'కలత్తూర్ కన్నమ్మ' సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణం 'విక్రమ్' వరకు కొనసాగుతోంది. అనేక అవార్డులు అందుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. కార్యకర్తలకు కమల్ హాసన్ విడుదల చేసిన ప్రకటనలో...
కమల్ హాసన్
బిరుదులతో సంతోషించాను
నాపై ఉన్న అభిమానంతో 'ఉలగ నాయగన్'తో సహా ఎన్నో బిరుదులతో పిలుస్తున్నారు. ప్రజలు, సహచర కళాకారులు, అభిమానులు ఇచ్చిన ఈ బిరుదులకు సంతోషిస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుడిని.
కళ కంటే కళాకారుడు గొప్ప కాదు
సినిమా కళ ఏ ఒక్క వ్యక్తి కంటే గొప్పది. ఆ కళలో నేర్చుకుంటూ, అభివృద్ధి చెందాలనుకునే విద్యార్థిని నేను. ఇతర కళల లాగే సినిమా కూడా అందరిదీ. ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులు, మంచి అభిమానులు కలిసి సినిమాని తయారు చేస్తారు. కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా నమ్మకం.
కమల్ హాసన్
ఇలా పిలిస్తే చాలు
కాబట్టి, నా అభిమానులు, మీడియా, సినీ పరిశ్రమ, మక్కల్ నీది మయ్యం కార్యకర్తలు, భారతీయులు నన్ను కమల్ హాసన్, కమల్ లేదా KH అని పిలిస్తే చాలు.తనకి యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు లాంటి బిరుదులు వద్దు అని కమల్ హాసన్ అన్నారు.