బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో..ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే, కె బ్యాచ్ నుంచి వికెట్ డౌన్ ?

First Published | Nov 11, 2024, 12:02 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం జరుగుతున్న నామినేషన్స్, ఎలిమినేషన్స్ అత్యంత ఆసక్తిగా మారిపోతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ షో చివరి దశకి చేరుకుంటున్నప్పుడు టాప్ 5 లో నిలిచేది ఎవరు అనేది తెలియాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఎలిమినేషన్స్ కీలకం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం జరుగుతున్న నామినేషన్స్, ఎలిమినేషన్స్ అత్యంత ఆసక్తిగా మారిపోతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ షో చివరి దశకి చేరుకుంటున్నప్పుడు టాప్ 5 లో నిలిచేది ఎవరు అనేది తెలియాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఎలిమినేషన్స్ కీలకం. చివరగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన హారితేజ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది. ఇంకా 11 వారం మొదలయింది. 11 వారంలో నామినేషన్స్ లో ఎవరు ఉంటారు ? ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. 

11వారం నామినేషన్స్ లిస్ట్ లీకైనట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు 11వ వారం నామినేషన్స్ లో జబర్దస్త్ అవినాష్, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ, గౌతమ్, యష్మి నామినేషన్స్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో అవినాష్, యష్మి, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 


హౌస్ లో కన్నడ నటీనటులు కె బ్యాచ్ గా బాగా పాపులర్ అయ్యారు. వీరిపై ట్రోలింగ్ బాగా జరుగుతోంది. అదే సమయంలో మద్దతు తెలిపేవారు కూడా ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ కె బ్యాచ్ కిందికి వస్తారు. ప్రేరణ, నిఖిల్ ఈసారి నామినేషన్స్ లో లేరు. పృథ్వీ, యష్మి ఉన్నారు. యష్మి పై చాలా కాలంగా త్రీవ్రమైన నెగిటివిటీ ఉంది. లాస్ట్ వీక్ కూడా ఆమె నామినేషన్స్ లో ఉన్నారు. ఆమెతో పాటు వీక్ కంటెస్టెంట్ గా ఉన్న హరితేజ కూడా నామినేట్ అయ్యారు. 

హరితేజ, యష్మి లలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనుకున్నారు. హరితేజ బాగా వీక్ గా ఉండడంతో ఓటింగ్ తగ్గిపోయింది. దీనితో జస్ట్ లో యష్మి ఎలిమినేషన్ తప్పించుకుని బతికిపోయింది. కానీ ఈవారం కూడా యష్మి నామినేట్ అయింది. దీనితో యష్మి ఈ సారి ఎలిమినేట్ కాక తప్పదు అంటూ నెటిజన్లు అంచనా వేస్తున్నారు. 

మరోవైపు అవినాష్ గురించి కూడా చెప్పలేని పరిస్థితి. అతడు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్, యష్మి లలో ఎవరైనా ఏ,ఎలిమినేట్ కావచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి రానున్న రోజుల్లో జరిగే ఓటింగ్ ని బట్టి వీరిలో ఎవరు బయటకి వెళతారో ఒక అంచనాకి రావచ్చు. 

Latest Videos

click me!