ఆ విధంగా స్టెరాయిడ్స్ తీసుకుని కెరీర్ పాడుచేసుకున్న సీనియర్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె పేరు దీప. ఆమె కేరళకి చెందిన నటి. అసలు పేరు ఉన్ని మేరీ. సినిమాల కోసం తన పేరుని దీపగా మార్చుకుంది. 70, 80 దశకాల్లో చాలా మంది తెలుగు హీరోలతో కలసి నటించింది. ఏఎన్నార్ తో కూడా నటించింది. మురళి మోహన్ తో కలసి ఖైదీ నెంబర్ 77, దశ తిరిగింది లాంటి చిత్రాల్లో నటించింది.