`బిగ్‌ బాస్‌ తెలుగు 9` లేటెస్ట్‌ ఓటింగ్‌, డేంజర్‌లో కమెడియన్లు, టాప్‌ లో దూసుకెళ్తున్నది వీరే

Published : Nov 07, 2025, 04:35 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి తొమ్మిదో వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇద్దరు కమెడియన్లు ఈ వారం డేంజర్‌ జోన్‌ లో ఉన్నారు. 

PREV
15
తొమిదో వారం నామినేషన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 తొమ్మిదవ వారం ఆసక్తికరంగా సాగుతోంది. గత వారాలతో పోల్చితే ఇప్పుడు షో కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. చాలా వరకు కంటెస్టెంట్లు సేఫ్‌ గేమ్‌ నుంచి బయటపడుతున్నారు. ఒక్కొక్క బాండింగ్‌ బ్రేక్‌ అవుతుంది. అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు. దీంతో ఇది ఆసక్తిని పెంచుతుంది. ఈ క్రమంలో ఈ వారాంతం కూడా రాబోతుంది. ఓటింగ్‌కి ఈ ఒక్క రోజే ఛాన్స్ ఉంది. శుక్రవారంతో నామినేషన్‌లో ఉన్న వారికి ఓట్ వేసే అవకాశం ముగుస్తుందనే విషయం తెలిసిందే. ఈ వారం కళ్యాణ్‌ పడాల, భరణి, తనూజ, సాయి శ్రీనివాస్‌, సంజన, సుమన్‌ శెట్టి, రాము రాథోడ్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు హౌజ్‌ని వీడతారనేది ఆసక్తికరంగా మారింది.

25
ఓటింగ్‌లో దూసుకుపోతున్న కళ్యాణ్‌

ప్రస్తుతం గురువారం వరకు పోల్‌ అయిన ఓటింగ్‌ ప్రకారం టాప్‌లో  ఉన్నది ఎవరు? బాటమ్‌లో ఉన్నదెవరనేది తేలిపోయింది. కళ్యాణ్‌ ఈ వారంలో కూడా టాప్‌లో దూసుకుపోతున్నారు. ఆర్మీ జాబ్‌ని వదిలేసుకుని బిగ్‌ బాస్‌ కి వచ్చిన కళ్యాణ్‌ ప్రారంభంలో తడబడ్డా ఆ తర్వాత చాలా స్ట్రాంగ్‌ అయ్యాడు. ఓటింగ్‌లోనూ తన రేంజ్‌ చూపిస్తున్నాడు. ఆయన నామినేట్‌ అయిన ప్రతిసారి టాప్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కూడా తనే టాప్‌లో ఉండటం విశేషం. సెలబ్రిటీ కంటెస్టెంట్లని కూడా పక్కకు నెట్టి ఓటింగ్‌లో ముందున్నాడు కళ్యాణ్‌ పడాల.

35
రెండో స్థానంలో రచ్చ చేస్తోన్న తనూజ

ఆ తర్వాత తనూజ టాప్‌ 2లో ఉంది. ఆమెకి కూడా ఓటింగ్‌ బాగా వస్తోంది. మొన్నటి వరకు సేఫ్‌ గేమ్‌, సింపతి గేమ్‌ ఆడుతూ వచ్చిన ఆమె ఇప్పుడు జెన్యూన్‌గా ఆడుతోంది. చాలా సార్లు టాస్క్ ల్లో ఆమెకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ ల్లో చాలా సార్లు ఆమె చివరి వరకు వచ్చి ఓడిపోతుంది. ఈ వారం కూడా అదే జరిగింది.  ఇది ఆమెకి ప్లస్‌గా మారుతుంది. దీంతో ఓటింగ్‌లో తనూజ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో సంజనా ఉంది. ఆమె టాస్క్ ల కంటే ఫన్నీ యాక్టివిటీస్‌తో హైలైట్‌ అవుతున్న విషయం తెలిసిందే. 

45
సేఫ్‌ జోన్‌లో భరణి, సంజన

ఆ తర్వాత స్థానంలో భరణి ఉన్నాడు. ఆ తర్వాత శ్రీనివాస సాయి ఉన్నారు. ఇన్నాళ్లు టాప్‌లో ఉంటూ వస్తోన్న సుమన్‌ శెట్టి బాటమ్‌ 2లో ఉండటం గమనార్హం. ఇక చివరగా రాము రాథోడ్‌ ఉన్నాడు. ఆయనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. రాము రాథోడ్‌ యాక్టివిటీస్‌ కూడా కామెడీని పంచుతున్నాయి. మీమర్స్ కి బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ ఫన్‌ వర్కౌట్‌ కావడం లేదు. ఈ వారం రాము రాథోడ్‌ ఎలిమినేట్‌ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ వారం రాము రాథోడ్‌ తోపాటు కమెడియన్‌ సుమన్‌ శెట్టి కూడా బాటమ్‌లోనే ఉన్నారు. ఓ రకంగా ఈ ఇద్దరు డేంజర్‌ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. అయితే రాము, సుమన్‌ శెట్టిల మధ్య ఓట్ల తేడా చాలా ఉంది. కాబట్టి రాము ఒక్క రోజులో సుమన్‌ శెట్టిని దాటడం సాధ్యమేనా అనేది డౌట్‌. ఈ ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో కమెడియన్లు ఇద్దరు డేంజర్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది శనివారంతో క్లారిటీ రానుంది.

55
డేంజర్‌ జోన్‌లో ఈ ఇద్దరు కంటెస్టెంట్లు

ఇక నాగార్జున హోస్ట్ గా రన్‌ అవుతున్న `బిగ్‌ బాస్‌ తెలుగు 9` షో సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్‌, హరిత హరీష్‌, ప్రియా శెట్టి, శ్రీజ, ఫ్లోరా సైనీ, దివ్వెల మాధురి, భరణి ఎలిమినేట్‌ అయ్యారు. వీరిలో భరణి మళ్లీ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది అన్‌ ఫెయిర్‌ గేమ్‌ అనే టాక్‌ వినిపించింది. విమర్శలు వచ్చాయి. ఇక ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సంజనా, తనూజ, కళ్యాణ్‌, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, రాము రాథోడ్‌, ఇమ్మాన్యుయెల్‌, దివ్య, గౌరవ్‌, నిఖిల్‌ నాయర్‌, భరణి  ఉన్నారు. వీరిలో టాప్ కి వెళ్లేదెవరనేది ఆసక్తి కారంగా మారింది. అయితే వచ్చే వారం నుంచి హౌజ్‌లో డబుల్ ఎలిమినేషన్‌ ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories