కమల్ హాసన్ ను కాదని చిరంజీవితో హిట్ సినిమా తీసిన తమిళ దర్శకుడు, ఏ సినిమానో తెలుసా..?

First Published | Sep 24, 2024, 7:55 PM IST

కమల్ హాసన్ చేయాల్సిన సూపర్ హిట్ మూవీ చిరంజీవి చేసిస సందర్భం ఒకటి ఉంది. అది కూడా ఓ తమిళ దర్శకుడితో.. ఇంతకీ ఆ హిట్ సినిమా ఏంటి..? ఎవరా దర్శకుడు..? 
 

కొన్ని కొన్ని సినిమాలు ఒక హీరో చేయాల్సినవి.. మరో హీరో చేసి సూపర్ సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో  కొన్ని సినిమాల గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక లోక నాయకుడు కమల్ హాసన్ చేయాల్సిన సినిమాను చిరంజీవి చేసి.. హిట్ కోట్టాడని మీకు తెలుసా..? 

Al so Read: ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు ఎవరు..?

Chiranjeevi Konidela

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. డిజాస్టర్ సినిమాలు కూడా చేశారు. తనదైన నటనతో కోట్లాది  అభిమానులను సంపాధించుకున్న చిరు... టాలీవుడ్ లో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఆయన్ను మించిన స్థాయికి ఎవరు రాలేకపోయారు అనేది అందరికి తెలిసిన సత్యం. 
 

Al so Read: 3 వారాలకు అభయ్ నవీన్ బిగ్ బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.. ?


Actor Kamal Haasan

ఇక కోలీవుడ్ లో కమల్ హాసన్ కూడా అంతే.. ప్రయోగాలు పెట్టింది పేరుగా నిలిచారు కమల్. ఇండియన్ సినిమాలో ఎక్స్ పెర్మెంట్స్ స్టార్ట్ చేసింది కమల్ హాసన్. అందులో సక్సెస్ అయ్యింది కూడా ఆయనే. దశావతారం లాంటి అద్బుతాలను ఆయన మాత్రమే సాధించగలిగారు. 

Al so Read:  బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి..

ఇక చిరు కమల్ వయస్సులో పెద్దగా తేడా లేదు. కాని ఇద్దరు మంచి మిత్రులు.. సినిమాల విషయంలో కూడా వీరి స్నేహం అంతే కొనసాగింది. అంతే కాదు కమల్ హాసన్ చేయాల్సిన ఓ సినిమాను చిరంజీవి హీరోగా చేసి... అద్భుత విజయం సాధించిన సందర్భం ఉంది. అది కూడా తమిళ దర్శకుడితో. 
 

ఇంతకీ ఆసినిమా ఏదో కాదు ఆరాధన. ఆ దర్శకుడు కూడా అందరికి తెలిసిన అతనే.. భారతీరాజా. ఇక విషయానికి వస్తే.. తమిళంలో భారతీరాజా కట్టప్ప సత్యరాజ్ ను హీరోగా పెట్టి.. కవితోర  కవితైగల్ అనే సినిమాను తెరకెక్కించారున ఈకథనే తెలుగులో కమల్ హాసన్ ను హీరోగా పెట్టి రీమేక్ చేయాలి అని అనుకున్నారట. 

కాని ఈ సినిమాకు కమల్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో.. తెలుగు హీరోలను వెతుక్కున్నారట భారతీ రాజా. ఈక్రమంలోన ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఈ కథ చెప్పడం.. ఆయన సరే అనడంతో.. రూపొందిన సినిమానే ఆరాధన. ఈసినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి నటనకు మంచి పేరు వచ్చింది. 

చిరంజీవి హీరోగా సుహాసిని, రాధిక, రాజశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన ఆరాధన తెలుగు లో హిట్ అయ్యింది. చిరంజీవికి నటుడిగా మంచి పేరును కూడా తీసుకువచ్చింది. ఇలా కమల్ హాసన చేయాల్సిన సినిమాను మెగాస్టార్ చిరంజీవి చేసి తెలుగులో హిట్ కొట్టాడు. 

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట తో సోసియో ఫ్యాంటీసీ మూవీ చేస్తున్నారు. విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈమూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు  20 ఏళ్ళ తరువాత త్రిష మెగాస్టార్ సరసన నటిస్తుండటం విశేషం.  

Latest Videos

click me!