కలెక్షన్ కింగ్‌గా కొన్నేళ్లపాటు రాణించారు మోహన్‌బాబు. విలన్ నుంచి హీరోగా మారి, మళ్లీ విలన్‌గా టర్న్ తీసుకుని, మళ్లీ హీరోగా నిలబడ్డారు. ఇప్పటికీ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. ఆయన నటిస్తున్న సోలో హీరోగా సినిమాలు ఆడటం లేదు. దీంతో పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `కన్నప్ప`లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా ఆయనే నిర్మిస్తుండటం విశేషం.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇండస్ట్రీలో మోహన్‌బాబు అంటే అందరికి ఓ భయంతో ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉంటుంది. నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా, ఎవరికీ భయపడకుండా చెప్పేస్తారు. వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే ఓపెన్‌గానే హెచ్చరిస్తాడు. ఆయన విషయంలో తేడా వస్తే దానికి తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుందనే కామెంట్ కూడా ఉంది.
అందుకే ఆయనంటే అందరికి ఓ రకమైన భయం. ఎవరూ అంత ఈజీగా ఆయనతో పెట్టుకోరు. తను కూడా ఎవరి జోలికీ వెళ్లరు, తన పనేదో తాను చేసుకుంటాడు. పెద్దగా సినిమా ఈవెంట్లలోనూ కనిపించరు. తన చుట్టూ ఏదైనా వివాదం నడిస్తే, అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే మాత్రం అందరి కంటే ముందే ఆయన రియాక్షన్ ఉంటుంది.
అలాంటి మోహన్‌బాబ్‌ని పట్టుకుని షాకింగ్ కామెంట్ చేశాడు కింగ్ నాగార్జున. చిరంజీవి, బాలయ్య, కృష్ణంరాజు, వెంకీ, రాజేంద్రప్రసాద్, సీనియర్ హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు హాజరైన ఈవెంట్‌లో, అందరి ముందు స్టేజ్‌పైనే మోహన్‌బాబుని పట్టుకుని జేబు దొంగ అంటూ పిలిచారు నాగ్.
తనదంతా కొట్టేశాడని, మోహన్‌బాబు పెద్ద జేబు దొంగ అని కామెంట్ చేశారు నాగ్. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి మోహన్‌బాబు సైతం స్టేజ్‌పైనే మన్మథుడికి వార్నింగ్ ఇచ్చాడు. ఏఎన్నార్‌ని చూసి వదిలేస్తున్నా జాగ్రత్త అని తెలిపారు. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది చూస్తే,
ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత టీ సుబ్బరామిరెడ్డి తన పేరుతో టీవీ9తో కలిసి అప్పట్లో అవార్డులు ఇచ్చేవారు. అలా ఓసారి వైజాగ్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. దీనికి చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, బాలకృష్ణ, కృష్ణంరాజుతోపాటు చాలా మంది ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఇందులో చాలా మంది గెస్ట్ లు మాట్లాడారు. చివర్లో ఇద్దరు ముగ్గురు చిరు, నాగ్, బాలయ్య వంటి వారు ఉన్నారు.
నాగ్‌కి మైక్ ఇచ్చాడు సుబ్బరామిరెడ్డి. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, చాలా మాట్లాడాలని, పేపర్ మీద కూడా రాసుకొచ్చాను. కానీ మోహన్‌బాబు నా జేబులో నుంచి ఎప్పుడు కొట్టేశాడో ఏమో, మొత్తం నేను మాట్లాడాలనుకున్నది ఆయన మాట్లాడేశారు అంటూ కామెంట్ చేశారు. ఆ సమయంలో మోహన్‌బాబు స్టేజ్ వెనకాల ఉండి ఏదో సమాధానం చెప్పారు.
అంతటితో ఆగని నాగార్జున.. మోహన్‌బాబు జేబు దొంగ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత సారీ అని కూడా అన్నాడు. దెబ్బకి స్టేజ్ దిగబోతున్న మోహన్‌బాబు.. నాగ్ వద్దకు వచ్చి `నిన్నుగానీ, బాలయ్యని గానీ కొన్ని సందర్భాల్లో ఎందుకు వదిలేస్తానో తెలుసా? అక్కడ రామారావుగారు మా అన్నయ్యని చూసి, ఇక్కడ నాగేశ్వరరావుగారిని చూసి, జాగ్రత్త` అంటూ స్టేజ్ దిగి వెళ్లిపోయాడు.
అయితే ఇదంతా జస్ట్ ఫన్నీగా కావడం విశేషం. ఈ సరదా కన్వర్జేషన్ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఫ్యాన్స్ కి ఊపు తీసుకొచ్చింది. వీరి మధ్య ఈ సరదా కామెంట్లతో ఫ్యాన్స్ అంతా అరుపులతో హోరెత్తించారు.
మోహన్‌బాబు, నాగార్జున ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఎప్పుడూ వీరిద్దరు కలుసుకున్నట్టు అనిపించదు, కానీ సినిమా పరంగా మంచి రిలేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. `అన్నమయ్య`, `విజయ్`, `అగ్ని`, `అధిపతి`, `జగద్గురు ఆది శంకర`, `ప్రేమ యుద్దం`, `మురళీ కృష్ణుడు`, `చినబాబు` వంటి సినిమాల్లో కలిసి నటించారు. అందుకే వీరిద్దరి మధ్య అ చనువు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం నాగ్ `కుబేర`, `కూలీ` చిత్రాల్లో నటిస్తున్నారు. సోలో హీరోగా మూవీకి వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.