ఇండియన్ 2 సినిమా ఎందుకు చూడాలి..? కమల్ హాసన్ సినిమాలో 5 ప్రత్యేకతలివే...?

First Published Jul 10, 2024, 4:00 PM IST

గ్లోబల్ స్టార్  కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమా ఇండియన్ 2. భారీఎత్తును ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న  ఈసినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ ఇండియన్ 2ను ఎందుకు చూడాలి..? ఈసినిమా ఎందుకు చూడాలి అని అనడానికి 5 కారణాలను  చూస్తే..? 

Indian movie

ఇండియన్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదరు చూస్తున్నారు. కమల్-శంకర్ కాంబోలో 1996లో వచ్చిన 'ఇండియన్' సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ మూవీలో  కమల్ హాసన్ స్వాతంత్ర్యసమరయోధుడిగా, అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకిగా కనిపించారు. అన్యాయం, లంచం నిరోదించడం లాంటి కాన్సెప్ట్ లో తన కన్న కొడుకుని కూడా వదల్లేదు పెద్దాయి.

విజయ్ కాంత్ కు అవమానం, బాలీవుడ్ వాళ్లను కొట్టడానికి వెళ్లిన కుష్బూ, ఏం జరిగింది..?

ఇక ఈసారి మొదటి భాగం కంటే రెండవ భాగంలో కమల్ హాసన్ పాత్రకు ఇంకాస్త ఇంపార్టెన్స్ పెంచారట. భారతీయుడు 2లో ప్రస్తుతం ఉన్న అవినీతి తో పాటు..టెక్నాలజీని కథలో భాగం చేసినట్టు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను భయపెట్టడం ఖాయం అంటున్నారు. 

40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Latest Videos


indian 2

ఇక ఈసినిమా కోసం జనాలు ఆత్రుతగా ఎదురుచూడటానికి మరోకారణం కమల్ హాసన్. అవును లోకనాయకుడి పెర్ఫార్మెన్స్ అది కూడా దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చూడటం  కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దర్శకుడు శంకర్ సాధారణంగా కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట. ఐతే మళ్లీ 'ఇండియన్ 2'లో అతడి మ్యాజిక్ ఉంటుందనడంలో సందేహం లేదు. ‘ఇండియన్ 2’ ట్రైలర్ లోనే కమల్ యాక్షన్ ని మించి సినిమా హైలైట్స్ అయిన లవ్, సెంటిమెంట్, ఒపీనియన్ ని ఫ్యాన్స్ గమనించారు. మరి శంకర్ ఎలా సర్ ప్రైజ్ చేయబోతున్నాడు అనేది చూడాలి. 

కమల్ హాసన్ తో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో, వేల కోట్లకు వారసుడు..?

'ఇండియన్ 2'లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇందులో  సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అది కూడా మునుపెన్నడూ చేయని అద్భుతమైన పాత్రను పోషించాడు సిద్దార్ధ్. ఇక ఇందులో చెప్పుకోవలసిన విషయం ఏంటంటే.. శంకర్ డైరెక్షన్ లో సిద్దార్ధ్ 21 ఏళ్ళ తరువాత నటించాడు. అసలు సిద్దు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందే.. శంకర్ డైరెక్ట్ చేసిన బాయ్స్ సినిమాతో. 2003 లో రిలీజ్ అయిన ఈసినిమా సిద్దును నిలబెట్టింది. మరి ఈసారి సిద్దును ఇండియన్ 2 లో ఎలా చూపించబోతున్నాడు అన్నది అందరిలో డౌట్.  అయితే టీమ్ సమాచారం ప్రకారం.. స్టార్టింగ్ నుంచి  క్లైమాక్స్ వరకు, సిద్ధార్థ్ పాత్ర 'ఇండియన్ 2' మరియు కమల్ హాసన్‌తో ముడిపడి ఉంటుందని అంటున్నారు. అలా సిద్ధార్థ్ నటన కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

రాజమౌళిపై నోరు పారేసుకున్న దర్శన్, కన్నడ హీరో నోటి దురుసు అంతా ఇంత కాదు..

indian 2 ar rahman anirudh ravichander

ఈసినిమా చూడటానికి మరో కారణం అవ్వబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్థ్. 1996లో విడుదలైన 'ఇండియన్'  సినిమాకు  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అప్పటి సాంగ్స్ ఇప్పటికి మారుమోగుతున్నాయి. పచ్చనిచిలకలు తోడుండే అంటూ ఇప్పటికీ పాడుకుంటుంటారు జనాలు. ఇక ఇప్పటి భారతీయుడు సీక్వెల్ కు మాత్రం  అనిరుధ్ సంగీతం అందించారు. 2018లో, AR రెహమాన్ ను ఈసినిమాకు పనిచేయాలని అడగ్గా.. తను ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అనేశాడట. దాంతో అప్పుడు అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. జైలర్ లాంటి హిట్స్ తో ఊపు మీద ఉన్న అనిరుధ్ ఈసినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో చూడాలి. 

షూటింగ్ చూడ్డానికి వెళ్తే.. పెళ్లి చేసుకుంటావా అన్నాడు.. స్టార్ డైరెక్టర్ క్యూట్ లవ్ స్టోరీ..

అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి 5వ కారణం సినిమా కాస్టింగ్. దర్శకుడు శంకర్ ఈ చిత్రంలో భారీ తారాగణాన్ని సమకూర్చారు. నటి కాజల్ అగర్వాల్, రాకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జె సూర్య, బాబీ సింహా, వివేక్, నేదురుమూడి వేణు, గుల్షన్ గ్రోవర్, మనోబాల తదితరులు 'ఇండియన్ 2'లో ముఖ్య పాత్రలు పోషించారు. వారి డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చూడాలంటే థియేటర్ కి వెళ్లాల్సిందే. అంతే కాదు  ఈ సినిమాలో నటించిన వివేక్, మనోబాల, నేదురుమూడి వేణు ఇప్పుడు ఈలోకంలో లేరు. 

click me!