పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ..వీరిలో ఇండస్ట్రీ హిట్ పక్కా అని చెబితే డేట్లు ఇచ్చే హీరో ఎవరో తెలుసా

Published : Jul 10, 2024, 03:58 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చారు. కొత్త వారిని కూడా పరిచయం చేశారు. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ ఇలా క్రేజీ స్టార్ హీరోలతో పూరి జగన్నాధ్ సినిమాలు చేశారు.

PREV
16
పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ..వీరిలో ఇండస్ట్రీ హిట్ పక్కా అని చెబితే డేట్లు ఇచ్చే హీరో ఎవరో తెలుసా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చారు. కొత్త వారిని కూడా పరిచయం చేశారు. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ ఇలా క్రేజీ స్టార్ హీరోలతో పూరి జగన్నాధ్ సినిమాలు చేశారు. ప్రభాస్ కి తప్ప మిగిలిన హీరోలందరికీ పూరి జగన్నాధ్ సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చారు. 

26

హీరోల కథ చెప్పి వెంటనే ఒప్పించే కిటుకు పూరికి బాగా తెలుసు. బద్రి చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ని తాను ఎలా మాయ చేశానో అని పూరి చాలా సందర్భాల్లో చెప్పారు. పవన్ వేరే సినిమా కథ చెప్పి ఆ తర్వాత బద్రి సినిమా చేశానని అన్నారు. అయితే మహేష్ బాబు బిజినెస్ మాన్ చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోల గురించి ఆసక్తికమైన ఫన్నీ కామెంట్స్ చేశారు. 

36

ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. టాలీవడ్ లో ఏ హీరోకి ఏం చెబితే వెంటనే డేట్లు ఇస్తారో అని పూరి ఫన్నీగా చెప్పారు. ఈ సినిమా మొత్తం గన్స్ ఉంటాయి. విలన్ పెద్ద గన్ డీలర్. ఇష్టం వచ్చినట్లు కాల్చేసుకోవచ్చు అని చెబితే పవన్ కళ్యాణ్ వెంటనే డేట్లు ఇచ్చేస్తారు. 

46

అవుట్ డోర్ షూటింగ్ ఏమి ఉండదు.. మొత్తం ఇండోర్ షూటింగ్.. భారీ సెట్లు ఉంటాయి అని చెబితే ప్రభాస్ డేట్లు ఇచ్చేస్తారట. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ పక్కా, రికార్డులు బద్దలైపోతాయి అని చెబితే ఎన్టీఆర్ డేట్లు ఇచ్చేస్తాడట. 

56

రేపు షూటింగ్ మొదలవుతుంది..30 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెబితే రవితేజ డేట్లు ఇస్తాడు. రేపు సినిమా మొదలవుతుంది.. కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని చెబితే మహేష్ బాబు డేట్లు ఇచ్చేస్తారు అంటూ పూరి జగన్నాద్ ఫన్నీ కామెంట్స్ చేశారు. 

66

అప్పట్లో స్టార్ హీరోలకి ఉన్న మైండ్ సెట్ ఆధారంగా పూరి ఇలా ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories