కమల్ హాసన్ పస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? షాక్ అవుతారు..

Published : Dec 08, 2024, 09:35 PM IST

ప్రయోగాలకు పెట్టిందిపేరు కమల్ హాసన్. సినిమాల విషయంలో ఆయన చేసినన్న ప్రయోగాలు ఇంకెవరు చేసి ఉండరు. లోకనాయకుడిగా పేరు పొందిన కమల్ హాసన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతోతెలుసా..? 

PREV
16
కమల్ హాసన్ పస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? షాక్ అవుతారు..

కమల్ హాసన్ పేరు కాదు సినిమాకు ఆయన బ్రాండ్. సినిమా కోసం ప్రాణం పెడతారు. సినిమాల కోసం ఎన్నో రిస్క్ లు కూడా చేశారు. కమల్ హాసన్ సినిమా కోసం చేసినన్నిప్రయోగాలు ఇంకెవరు చేసి ఉండరు. ఒక్క సినిమాలో 10 గెటప్పులు.. వాటికోస మేకప్ వేసుకోవడం తీయ్యడం. అది కూడా గంటలకొద్ది మేకప్ వేసుకోవడం తీయ్యడం. ఇదంతా ఇతరులకు సాధ్యం అయ్యే పని కాదు. ఇంత రిస్క్ చేయాలంటే కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యం. 

Also Read: Jr NTR కు చాలా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా..? ఆదివారం అస్సలు వదిలిపెట్టడట.

26

ఆయన తరువాత అలా ప్రయోగాలు చేయగల హీరో అంటే విక్రమ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇక కమల్ హాసన్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా అంతే ఇమేజ్ ఉన్న హీరో. తెలుగులో డైరెక్ట్ సినిమాలెన్నో చేశారు కమల్. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాల కోసం కమల్ హాసన్ చేసిన సాహసాలు కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు కూడా తీసుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి. 

Also Read:సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న రజినీకాంత్..? సూపర్ స్టార్ నిర్ణయానికి కారణం ఏంటి..?

36
Actor Kamal Haasan

ఇక 70 ఏళ్ల వయస్సులో కమల్ ఇప్పటికి అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ కు 70 ఏళ్ళు.. అయినా ఆయన సినిమా కెరీర్ కు మాత్రం 60 ఏళ్ళు దాటి. ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ వచ్చి 60 ఏళ్ళు అవుతుంది. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.. ఆతరువాత హీరోగా ఎన్ని అద్భుతాలు చేశారో అందరికి తెలిసిందే. 

46

ఇక ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన కమల్ హాసన్ హీరోగా మాత్రమే కాదు దర్శకుడిగా, నిర్మాత, గాయకుడిగా, రచయితగా, క్లాసికల్ డాన్సర్ గా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. అంతే కాదు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న కమల్ హాసన్.. తన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో వెల్లడించారు. ఇంతకీ కమల్ హాసన్ ఫస్ట్ సినిమాకు బాలనటుడిగా తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా.. 2000. 

56
Kalathur Kannamma

అవును కలత్తూరు కన్నమ్మ సినిమాతో ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయం అయ్యాడు కమల్. అయితే ఆసినిమాలో మహానటి సావిత్రి కొడుకుగా నటించాడు కమల్ హాసన్. ఆసినిమాకు ఆయనకు 2000 ఇచ్చారట. ఒకరకంగా చూసుకుంటే 60 ఏళ్ళ క్రితం 2వేలు అంటే చాలా పెద్ద అమౌంట్. హీరోలు మాత్రం పెద్ద హీరో 50 వేలు రెమ్యునరేషన్ తీసుకునేవారట. 

 

 

66

అలాంటిది ఊహ కూడా సరిగ్గా తెలియని బాలనడుటికి 2వేలు ఇవ్వడం గొప్ప విషయం. అయితే ఆ రెమ్యునరేషన్ తో ఏం చేశారు అని హోస్ట్ అడగ్గా.. నాకు సరిగ్గా ఊహ లేదు.. గుర్తు లేదు.. చిన్నవాడిని కదా.. అవి పెద్దవాళ్ల దగ్గరకు వెళ్తాయి అని అన్నారు కమల్. 

Read more Photos on
click me!

Recommended Stories