Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు

Published : May 07, 2026, 06:58 PM IST

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అగధ. హారర్ ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ టీజర్ విడుదలయింది. 

PREV
14
'అగధ' టీజర్

"ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే, కొన్ని వేధించేవి" అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో 'అగధ' టీజర్ మొదలవుతుంది. మొత్తం ఈ టీజర్ నిడివి 1 నిమిషం 44 సెకన్లు. ప్రతి ఫ్రేములోనూ ఏదో ఒక ఉత్కంఠ. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా, అలాగే ఏదో కొత్త కథ చూస్తున్నట్టుగా ఒక మార్మికమైన అనుభూతితో ఉత్కంఠభరితమైన అనుభవానికి లోను చేస్తూ ఈ టీజర్ కొనసాగుతుంది.

24
ఉత్కంఠ పెంచుతూ వెన్నులో వణుకు పుట్టించారు

ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు, మధ్య మధ్యలో ఆసక్తి రేకెత్తించే డైలాగ్స్ తో టీజర్ సాగుతోంది. "ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా" అని అడిగితే, ఒక అమ్మాయి భయంతో వణికిపోతూ "అగ్... అగ్... అగధ" అని చెప్పడంతో 'అగధ' అంటే ఎవరు అనే ఆసక్తి కలుగుతుంది. "అగధ' వచ్చేసిందమ్మా. 'అగధ' ముందు ఎవ్వరి ఆటలు సాగవు. రా... 'అగధా… రా"అంటూ వినిపించే డైలాగ్స్ తో టీజర్ తాలూకు ఉత్కంఠ పీక్ లెవెల్ కి చేరినట్టుగా అనిపిస్తుంది.

34
కాన్ఫిడెంట్ గా ఎమ్మెస్ రాజు

టోటల్ గా టీజర్ చూస్తే 'దేవి', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే' వంటి బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత ఎమ్మెస్ రాజు స్టాండర్డ్స్ ని మించి ఈ విజువల్స్ ఉన్నాయా అనిపిస్తుంది. 'అగధ' ను ఆయన డైరెక్ట్ చేసిన తీరుకి, ఆ విజువల్ ట్రీట్ కి ఒక్కసారిగా థ్రిల్ అవుతాం, అబ్బుర పడుతాం. ఈ సినిమా ఏ లెవెల్ లో ఉండబోతుందో చెప్పడానికి ఈ టీజర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎమ్మెస్ రాజు 'అగధ' విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే అంత ప్యాక్డ్ గా సినిమా సిద్ధమయ్యాకనే పబ్లిసిటీ లోకి దిగారు.

44
అగధ చిత్ర యూనిట్

పోస్టర్స్ విషయంలోనూ, టీజర్ … అలాగే రాబోయే ట్రైలర్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు 'అగధ' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.

సాంకేతిక బృందం:

రచయిత, దర్శకుడు: ఎం. ఎస్. రాజు

నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు

బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్

సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం

సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి

ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్

అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు.

Read more Photos on
click me!

Recommended Stories