లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ `సతీ లీలావతి`. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఫస్ట్ రివ్యూ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందంటే?
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన తొలి చిత్రం `సతీ లీలావతి`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించగా, వీకే నరేష్, వీటీవీ గణేషన్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఫన్నీగా నవ్వులు పూయించింది. మరి సినిమా కూడా అలానే ఉందా? అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ చిత్రం ఈ నెల 8న(శుక్రవారం) విడుదల కానుంది.
25
సతీ లీలావతి సెన్సార్ రిపోర్ట్ , స్టోరీ ఏంటంటే?
ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికెట్ వచ్చింది. 13ఏళ్లకు పై బడ్డ వాళ్లు చూడొచ్చు. అంతకంటే చిన్నవాళ్లు పేరెంట్స్ తో చూడాల్సి ఉంటుంది. ఈ సమ్మర్‌కిది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అవుతుందనే టాక్ ఉంది. మరి సినిమా కూడా అలానే ఉందా? అనేది చూస్తే. ఈ సినిమా కథ విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్నట్నుంచి లేని నవ్వు దేవ్ మోహన్ తన లైఫ్‌లోకి రావడంతో వస్తుంది. కొత్త జీవితం సాఫీగా సాగుతుంది. కానీ ఇంతలోనే దేవ్ మోహన్ లైఫ్‌లోకి మరో అమ్మాయి వస్తుంది. ఆమెనే మడోనా సెబాస్టియన్. దీంతో కుటుంబం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది. లావణ్యలో మరో యాంగిల్‌ని చూడాల్సి వస్తుంది. మరి ఆ కథేంటి? ఇద్దరి మధ్య గొడవలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? మడోన్నా కథేంటనేది సినిమా.
35
సతీ లీలావతి ఫస్ట్ రివ్యూ రిపోర్ట్
సినిమా మెయిన్‌గా కామెడీని నమ్ముకొని తీసినట్టుగా ఉంది. ఫన్ హైలైట్‌గా నిలుస్తుందట. ఫస్ట్ లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంటుందట. కొంత రొటీన్‌గానే ఉన్నా, దాన్ని తీసుకెళ్లిన తీరు బాగుంటుందట. ఆ తర్వాత రొమాంటిక్ సీన్లు బాగుంటాయని టాక్. దేవ్ మోహన్ జీవితంలో మరో అమ్మాయి ఉందని లావణ్యకి తెలిసిన తర్వాత చోటు చేసుకునే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయట. నవ్వులు పూయిస్తాయట. సినిమాలో ట్విస్ట్ లు కూడా ఉంటాయని టాక్. మరోవైపు నేటి ట్రెండీ విషయాలను కూడా ఇందులో చర్చించారట. కేవలం భార్యాభర్తల గొడవ మాత్రమే కాదు, ట్రైలర్‌లో రివీల్ చేయని చాలా అంశాలుంటాయని సమాచారం. అవి ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్ చేయడంతోపాటు ఆలోచింప చేస్తాయట. ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయని టాక్.
తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్ కూడా మరో హైలైట్‌గా నిలుస్తుందట. ఇక భార్యాభర్తల గొడవల నేటి తరం కుటుంబాలను తలపిస్తాయని అవి, క్రేజీగా ఉంటాయని టాక్. దేవ్ మోహన్, లావణ్యల మధ్య వచ్చే సీన్లు టామ్ అండ్ జెర్రీలా సాగుతాయని, కాకపోతే అవి ఓవర్‌గా అనిపించేలా ఉంటాయంటున్నారు. సినిమాలో అరుంధతి ఎపిసోడ్ కూడా ఉంది. అది కేవలం కామెడీ కోసం పెట్టారట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూ, చివర్లో హృదయాన్ని టచ్ చేస్తూ ముగుస్తుందట. అదే సమయంలో కొన్ని అంశాలు ఆలోచింప చేస్తాయని టాక్. విజువల్స్ మరో ప్లస్ అవుతుందని అంటున్నారు. దీంతోపాటు వీకే నరేష్, వీటీవీ గణేషన్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్ ఫన్ బాగుంటుందని టాక్.
55
అసలు మైనస్ ఏంటంటే?
అయితే సినిమాకి పెద్దగా బజ్ లేదు. ఈ వారం ఇదే పెద్ద సినిమా అయినా మార్కెట్‌లో పెద్దగా హైప్ కనిపించడం లేదు. ప్రమోషన్స్ వీక్‌గా ఉంది. రామ్ చరణ్ ప్రమోట్ చేసినా యూజ్ లేదు. ఓపెనింగ్స్ ని తేలేకపోతున్నాయట. మరోవైపు రొటీన్ స్టోరీ అనే టాక్ కూడా ఉంది. ఆశించిన రేంజ్‌లో మూవీ లేదని, రొటీన్ మూవీగానే ఉంటుందని మరో టాక్ వినిపిస్తుంది. అయితే ఇటీవల వస్తోన్న చిత్రాల్లో ట్రైలర్‌లో కామెడీ బాగుంటుంది, కానీ థియేటర్లో ఆశించిన స్థాయిలో వర్కౌట్ కావడం లేదు. మరి `సతీ లీలావతి` కూడా అదే కోవలోకి చెందిందా? ఆడియెన్స్ ని నవ్విస్తుందా? అనేది చూడాలి.