తారక్‌పై అన్న కళ్యాణ్‌ రామ్‌ షాకింగ్ కామెంట్స్.. గుడ్డుపై ఈకలు పీకేస్తాడట.. ఆయన నో చెబితే ఇక అంతే..

Published : Jul 27, 2022, 04:54 PM ISTUpdated : Jul 27, 2022, 07:27 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. తన అన్న కళ్యాణ్‌ రామ్‌ని గైడ్‌ చేస్తున్నారా? తమ్ముడు చెప్పిందే కళ్యాణ్‌ రామ్‌ ఫాలో అవుతున్నారా? సినిమా ఎంపికలో బిహైండ్‌ ఏం జరుగుతుందనేది తాజాగా కళ్యాణ్‌ రామ్‌ బయటపెట్టారు.   

PREV
16
తారక్‌పై అన్న కళ్యాణ్‌ రామ్‌ షాకింగ్ కామెంట్స్.. గుడ్డుపై ఈకలు పీకేస్తాడట.. ఆయన నో చెబితే ఇక అంతే..
photo credit great andhra interview

హీరో కళ్యాణ్‌ రామ్‌(Kalyan Ram) తమ్ముడు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR)పై ఆసక్తికర కామెంట్‌ చేశాడు. తన సినిమాల విషయంలో తారక్‌ ప్రమేయాన్ని బయటపెట్టాడు. ఓ సినిమాకి ముందు ఏం జరుగుతుందో రివీల్‌ చేశాడు కళ్యాణ్‌ రామ్‌. ఆయన హీరోగా నటించిన `బింబిసార`(Bimbisara) చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్‌, సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కళ్యాణ్‌ రామ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు రహస్యాలను బయటపెట్టారు. 
 

26

తమ్ముడు తారక్‌ వద్దని చెబితే `బింబిసార` వదిలేసే వారట కళ్యాణ్‌రామ్‌. తన సినిమాకి సంబంధించిన ప్రతి విషయం తారక్‌కి తెలుసని, అన్ని చెబుతానని అన్నారు. కథతోపాటు ఫస్ట్ లుక్‌ వరకు అన్ని ముందుగా ఎన్టీఆర్‌ కే చూపిస్తానని వెల్లడించారు. తమ్ముడు ఓకే అన్న తర్వాతే జనానికి చూపిస్తానని చెప్పారు. బయటకు చూపించి ఆడియెన్స్‌ ని అడగలేమని, అది తారక్‌ని అదిగితే పర్‌ఫెక్ట్ జడ్జ్ మెంట్ ఇస్తాడని తెలిపారు. అన్నా, తమ్ముడు అనే తేడా చూపించడని, ప్రొఫేషనల్‌ విషయాల్లో ఎన్టీఆర్‌ నిర్మొహమాటంగా ఉంటారని చెప్పారు.

36

ఫ్యామిలీ పరంగా తమ మధ్య అనుబంధం ఉన్నప్పటికీ, కెరీర్‌ పరంగా తమ్ముడు ఎన్టీఆర్‌ చాలా ఫేస్‌ టూ ఫేస్‌ ఉంటారని, ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే చెబుతాడని, లోపల ఏదీ ఉంచుకోడని తెలిపారు. సినిమాల విషయంలో బాగా లేకపోతే బాగాలేదని, గుడ్డు మీద ఈక పీకడమే అని తెలిపారు. తాను షూట్‌కి వెళ్లినా కూడా ఈ డ్రెస్ బాగుందా? లేదా ? అనేది కూడా ముందుగా ఎన్టీఆర్‌కే చూపిస్తానని, ఆయన బాగుందంటనే ముందుకు వెళ్తానని తెలిపారు. ఏదైనా మార్పులు చెబితే కచ్చితంగా చేస్తానని తెలిపారు. 
 

46

అయితే ఇలాంటి సినిమా మనకు వద్దు, సెట్‌ కాదేమో అని ఎన్టీఆర్‌ చెబితే `బింబిసార` వదిలేసేవారా? అన్న ప్రశ్నకి కళ్యాణ్‌ రామ్‌ చెబుతూ, కచ్చితంగా ఆలోచించేవాడినన్నారు. తమ్ముడు చెప్పాడంటే టీమ్‌ మొత్తం కూర్చొని దీనిపై చర్చించేవాళ్లమని, ఇలా లాభం లేకపోతే వదిలేయడానికి వెనకాడనని తెలిపారు కళ్యాణ్‌రామ్‌. తమ మధ్య అంతటి బాండింగ్‌ ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

56

మరోవైపు `బింబిసార` చిత్రంలో రాజుగా కనిపించడంపై కళ్యాణ్‌ రామ్‌ స్పందిస్తూ, దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు మొదట `బాహుబలి` (Bahubali) గుర్తొచ్చిందన్నారు. రాజమౌళి `బాహుబలి`లో ప్రభాస్‌(prabhas)ని రాజుగా చూపించారు. ప్రభాస్‌ ఆరడుగులుంటారు. రాజంటే ఇలా ఉంటాడనేది జనాల్లో ముద్ర పడింది. మళ్లీ ఇప్పుడు నేను రాజంటే ఎవరైనా చూస్తారా?ఝ బాగుంటుందా? అనే భయం ఉండేది. రిస్క్ చేస్తున్నామా?అనే ఫీలింగ్‌ ఉండింది. ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని ఇప్పటికీ ఆ భయం వెంటాడుతుందని చెప్పారు కళ్యాణ్‌ రామ్‌. 

66

ఇక ఈ నెల 29న `బింబిసార` చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో నిర్వహిస్తున్నారు. దీనికి ఎన్టీఆర్‌ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కళ్యాణ్‌రామ్‌ చెబుతూ, ఫంక్షన్‌కి మెయిన్‌ ఎట్రాక్షన్‌ తారకే అని చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత తారక్‌ బయటకు రాలేదని, ఫ్యాన్స్ అంతా వెయిట్‌ చేస్తున్నారని, ఆయన ఏం మాట్లాడతారనేది అంతా వెయిట్‌ చేస్తున్నారని చెప్పారు కళ్యాణ్‌ రామ్‌. ఎన్టీఆర్‌ సినిమా చూశాడని, ఆయన తన అభిప్రాయాన్ని చెప్పబోతున్నట్టు వెల్లడించారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories