నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.