Published : Jul 27, 2022, 03:56 PM ISTUpdated : Jul 28, 2022, 05:46 AM IST
ప్రతి దర్శకుడికి ఓ శైలి, బ్రాండ్ నేమ్ ఉంటుంది. పరిశ్రమలో పుట్టి పెరిగిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుది సపరేట్ స్టైల్. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. ఓ పాటలో హీరోయిన్ అందాలను ప్రదర్శించే తీరు చూసి అది రాఘవేంద్రరావు సినిమా అని చెప్పొచ్చు. సినిమాల్లో ఆయన శ్రీనాథుడు అని చెప్పాలి.
హీరోయిన్స్ నాభి, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ఎంత రొమాంటిక్ గా ఉంటుందో రాఘవేంద్ర రావు నుండే నేర్చుకోవాలి. పాటల్లో ఆ తరహా టేకింగ్ కి ఆయన బ్రాండ్ అంబాసడర్. రమ్యకృష్ణ, రంభ,విజయశాంతి, నగ్మా వంటి స్టార్ హీరోయిన్స్ తమ అందాలపై ఆయన పళ్ళు, పూలు విసిరారు.
28
జెనరేషన్స్ మారినా ఆ విషయంలో రాఘవేంద్రరావు క్రియేటివిటీ మారలేదు. ఈ తరం హీరోయిన్స్ తాప్సి,త్రిష, శ్రేయాలపై కూడా ఆయన ఈ ప్రయోగాలు చేశారు. ఓ సౌత్ మూవీ సాంగ్ లో నా నడుముపై గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలు వేశారంటూ తాప్సి బాలీవుడ్ ఈవెంట్ లో చెప్పగా ఆ వేదికపై ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు. రాఘవేంద్రరావుకి హీరోయిన్ నడుము ఓ ఫాంటసీ... అక్కడ పూలు, పళ్ళు విసరడం ద్వారా ఆడియన్స్ కి రొమాంటిక్ ఫీలింగ్ కలిగించగలమని ఆయన గట్టిగా నమ్ముతారు.
38
దర్శకుడిగా దశాబ్దాల అనుభవం ఉన్న దర్శకేంద్రుడు అలనాటి శ్రీదేవి నుండి అనేక మంది హీరోయిన్స్ అందాలను తెరపై ప్రదర్శించడంలో తన వంతు కృషి చేశాడు. సదరు హీరోయిన్స్ ఫేమ్ నేమ్ తెచ్చుకోవడానికి కారణమయ్యారు. అయితే మారే కాలాన్ని బట్టి ఆడియన్స్ అభిరుచి మారిపోయింది.ఇప్పుడు నడుము చూపించడం వెరీ కామన్. పబ్లిక్ లోనే అరాకొరా బట్టలేసుకుని హీరోయిన్స్ తిరగేస్తుంటే పాటల్లో ప్రత్యేకంగా నడుమును చూసి కలిగే అనుభూతి ఏముంటుంది?
48
అయితే ఈ అలవాటును రాఘవేంద్రరావు వదలలేకున్నారు. దానికి తాజా పోస్టరే నిదర్శనం. ఆయన సమర్పణలో వాంటెడ్ పండుగాడ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది. శ్రీధర్ సీపన దర్శకుడు. ఈ మూవీ నుండి నటి విష్ణు ప్రియా లుక్ విడుదల చేశారు. సదరు పోస్టర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. విష్ణు ప్రియా లంగా, జాకెట్ ధరించి ఉండగా బొడ్డులో మడిచిన తమలపాకు పెట్టారు.
58
K Raghavendra rao
ఆ ఆలోచన ఖచ్చితంగా రాఘవేంద్రరావుదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాంటెడ్ పండుగాడ్ చిత్రానికి శ్రీధర్ దర్శకుడు అయినప్పటికీ నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావుదే. ఈ నేపథ్యంలో తన క్రియేటివిటీ అంతా వాడి విష్ణు ప్రియా బొడ్డులో మడిచి తమలపాకు పెట్టాడు. విష్ణు ప్రియా లుక్ చూసిన నెటిజెన్స్... ఇది ఏ తరహా క్రియేటివిటీ దర్శకేంద్రా అంటున్నారు.
68
అలా అని ఆయన్ని తప్పుపట్టడానికి లేదు. ఆయన నమ్మిన సక్సెస్ ఫార్ములా అది. ఏళ్ల తరబడి వర్క్ అవుట్ అయ్యింది కూడా. ఇక సినిమాకు కమర్షియల్ ఫార్మాట్ పరిచయం చేసిన రాఘవేంద్రరావు క్లాస్, మాస్, డివోషనల్ జోనర్స్ లో చిత్రాలు చేసి సక్సెస్ అయ్యారు. దర్శకుడిగా అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు. రాజమౌళి లాంటి దర్శకుడికి ఆయన గురువు. రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.
78
K Raghavendra rao
ప్రస్తుతం విష్ణు ప్రియా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ మూవీలో విష్ణు ప్రియా శృతి అనే రోల్ చేస్తున్నారు. తడిసిన బట్టల్లో నడుము, నాభి చూపిస్తూ విష్ణు ప్రియ రొమాంటిక్ ఫోజ్ చూసిన ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
88
ఆగస్టు 19న వాంటెడ్ పండుగాడ్ విడుదల కానుంది. అనసూయ, బ్రహ్మానందం, సుడిగాలి సుధీర్, సునీల్, దీపికా పిల్లి, రఘుబాబు,సప్తగిరితో పాటు అనేక మంది కమెడియన్స్, టెలివిజన్ స్టార్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.