రిలీజ్ త్వరలో ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడిగా ఆషిక రంగనాథ్ నటిస్తోంది. తెలుగులో ఈ క్యూట్ హీరోయిన్ కి ఇదే తొలి చిత్రం. అప్పటికే అమిగోస్ పాటలు, ట్రైలర్ విడుదలయ్యాయి. ఆషిక అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోసినట్లు అర్థం అవుతోంది. తాజాగా అమిగోస్ చిత్ర యూనిట్ కళ్యాణ్ రామ్, ఆషిక, బ్రహ్మాజీ.. సుమ అడ్డా షోకి హాజరయ్యారు. ఈ షో ప్రోమో విడుదలయింది.