ఇక సదా కెరీర్లో ఉన్న మరో అతిపెద్ద హిట్ అపరిచితుడు. దర్శకుడు శంకర్-విక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ సదా ప్లాప్స్ తో రేసులో వెనుకబడింది. ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2016 తర్వాత రెండేళ్లు ఆమె పరిశ్రమకు దూరమయ్యారు.