Arjun Son Of Vyjayanthi
Arjun Son Of Vyjayanthi Twitter Review: నందమూరి కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సీనియర్ నటి విజయశాంతి ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లిగా, పోలీస్ అధికారిగా నటించారు. చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి పోలీస్ అధికారిగా నటించడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. గ్రాండ్ ప్రమోషన్స్ తర్వాత మంచి బజ్ తో ఈ చిత్రం నేడు శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, ట్విట్టర్ టాక్ ఎలా ఉంది ? కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రంతో హిట్ దక్కిందా ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vijayashanthi, Kalyan Ram
అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం విజయశాంతి పోలీస్ అధికారిగా కూంబింగ్ నిర్వహించే సన్నివేశంతో మొదలవుతుంది. ఈ సన్నివేశంలో ఆమె వింటేజ్ విజయశాంతిని గుర్తు చేస్తున్నారు. అలాగే తల్లి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ కూడా చూపించారు. ఈ చిత్రంలో మదర్ సన్ సెంటిమెంట్ హైలైట్ అవుతుందని ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతోంది.
Vijayashanthi, Kalyan Ram
ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు పడ్డాయి. తల్లి కొడుకుల మధ్య కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఆ తర్వాత కథ రొటీన్ గా మారిపోతుంది. గతంలో చాలా చిత్రాల్లో చూసిన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో మూవీ ముందుకు సాగుతుంది. దీనితో ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఉండదు. ఈ చిత్రానికి అతిపెద్ద డ్రాబ్యాక్ అంటే సంగీతం అనే చెప్పాలి. అంజినీష్ లోకనాథ్ అందించిన బిజియం, మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. కీలకమైన సన్నివేశాలని ఎలివేట్ చేయడంలో ఆయన బిజియం విఫలమైంది.
Vijayashanthi, Kalyan Ram
ఇక ఈ చిత్రంలో యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. డైలాగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ చిత్రం జనతా గ్యారేజ్ తరహా కాన్సెప్ట్ తో సాగుతుంది అని ఆడియన్స్ ట్విట్టర్ లో చెబుతున్నారు.
Vijayashanthi, Kalyan Ram
ఇక సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి ఇద్దరూ ఎమోషనల్ గా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అదే విధంగా సినిమా మొత్తం పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ అయితే యాక్షన్ సన్నివేశాల్లో టెర్రిఫిక్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రదర్శించారు. డైలాగులు కూడా బావున్నాయి.
Vijayashanthi, Kalyan Ram
ఫస్ట్ హాఫ్ రొటీన్ గా సాగడం, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు ఉండడం ఈ చిత్రంలో మైనస్. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా గొప్పగా లేదు. దర్శకుడు ప్రదీప్ ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకుల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నడిపించారు. ఈ చిత్రంలో ఊహించని విధంగా ట్విస్ట్ లు ఏమీ ఉండవు. ఎక్కువగా అంచనాలు లేకుండా ఆడియన్స్ థియేటర్స్ కి వెళితే ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.