అభిషేక్-కరిష్మా
అభిషేక్ బచ్చన్ మొదట కరిష్మా కపూర్‌ని పెళ్లి చేసుకోవాల్సి ఉంది. వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, కారణం ఏంటో తెలియదు కాని.. ఎంగేజ్మెంట్ కాన్సిల్ చేసుకున్నారు. ఆపై వారిద్దరూ వేరే వారిని పెళ్లి చేసుకున్నారు.
రష్మిక-రక్షిత్
ప్రముఖ నటి రష్మిక మందన్న కొన్ని సంవత్సరాల క్రితం కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది, కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కాని.. వీరి పెళ్లి జరగలేదు. రష్మిక టాలీవుడ్ లో క్లిక్ అయ్యింది. కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది. విజయ్ దేవరకోండతో రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
సల్మాన్-సంగీత
ఒకప్పుడు సల్మాన్ ఖాన్, సంగీత బిజ్లానీ ఒకరినొకరు ప్రేమించుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ తర్వాత వారు విడిపోయారు.
రవీనా-అక్షయ్
మీడియా కథనాల ప్రకారం, రవీనా టాండన్, అక్షయ్ కుమార్ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారట. కాని ఏం జరిగిందో తెలియదు కాని..ఆ తర్వాత వారు విడిపోయారు.