ఇక వెళ్లిపోతూ స్క్రాప్ ఎవరు అనేది చెప్పాలని నాగార్జున అడగ్గా, కళ్యాణ్ నిబ్బా నిబ్బిలా ఉంటాడని తెలిపింది. మెచ్యూరిటీ లేదని, ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలా, ఫస్ట్ టైమ్ లవ్ లో పడినట్టు బిహేవ్ చేస్తాడని తెలిపింది. ఏదో మాట్లాడుతుంటాడుగానీ, మాట్లాడటం కూడా రాదు అని తెలిపింది. అనంతరం దివ్య ఫోటోని స్క్రాప్‌లో వేసిన రమ్య.. అంతకు ముందు భరణితోనే ఎక్కువగా ఉండేదని, ఆయన వెళ్లిపోయాక ఆమెలో చాలా మార్పుకనిపిస్తుందని, ప్రతిదానికి కోప్పడుతుందని తెలిపింది. తనూజ గురించి చెబుతూ, విషయం పూర్తిగా తెలుసుకోక, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుందని నిజం తెలుసుకొని రియాక్ట్ కావాలని తెలిపింది. ఇక గౌరవ్ గురించి రమ్య చెబుతూ, ఆయన రాక్షసుడు అని, ఏదైనా చేయల్సి వస్తే దాని మీదనే ఉంటాడని, వదలడని తెలిపింది. ఈగో ఎక్కువ అని, తనే గెలవాలని కోరుకుంటాడని తెలిపింది. అనంతరం పవన్ ఫోటోని స్క్రాప్ లో వేస్తూ నీ గేమ్ నువ్వు ఆడు అని, ఊరికే ఎమోషనల్ కావద్దు అని, ఇతర విషయాలపై కాకుండా గేమ్ పై ఫోకస్‌పెట్టాలని తెలిపింది. బిగ్ బాంబ్ రీతూకి ఇచ్చింది. ఈ వారం మొత్తం ఆమె బాత్రూమ్‌లు క్లీన్ చేయాలి.