4 వేల జీతం నుంచి 600 కోట్ల సినిమా వరకూ.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ జర్ని సాగిందిలా..?

First Published | Jun 27, 2024, 7:50 AM IST

కల్కి సినిమాతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. టాలీవుడ్ కు హాలీవుడ్ సొగసులద్ది.. కల్కితో..రికార్డ్ లు బ్రేక్ చేయబోతున్నాడు. ఇంత భారీ సినిమాను చేసిన అతను 4 వేల జీతానికి పనిచేశాడని మీకు తెలుసా..? ఇంతకీ నాగ్ అశ్విన్ ఫిల్మ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది. 
 

ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ సముద్రం అందులోకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు.. కాని సునామీలా ఉవ్వెత్తున ఎగసేవారు మాత్రం తరాలు గుర్తుండిపోతుంటారు. అలా టాలీవుడ్ లో గుర్తించదగ్గ దర్శకులులు ఎవరు అంటే.. చాలామంది పేర్లు వినిపిస్తుంటాయి.. వారిని కూడా జల్లెడ పట్టివెతికితే.. రాజమౌళి.. ఆతరువాత నాగ్ అశ్విన్ పేరు కనిపిస్తుంది. బాహుబలితో టాలీవుడ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు రాజమౌళి తీసుకువస్తే.. కల్కితో హాలీవుడ్ సినిమాల రేంజ్ ను అందుకునేలా చేశాడు నాగ్ అశ్విన్. 
 

తాజాగా నాగ్ అశ్విన్  డైరెక్ట్ చేసిన కల్కి రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు ప్రీమియర్స్ నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ ఫీట్ కు కల్కి 2829 AD రెడీ అయ్యింది. కొన్నేళ్ళ ఫిలితం.. ఎంతో ఓపిగ్గా ఎదురు చూపులు ఫలించే టైమ్ వచ్చింది.  అయితే ఇంత భారీ  సినిమాను హ్యాండిల్ చేసిన.. బక్క పలుచని వ్యక్తి నాగ్ అశ్వన్.. తన కెరీర్ ను ఎలా ఎక్కడ స్టార్ట్ చేశాడు.. ? 

600 కోట్ల సినిమా తీసి.. సింపుల్ గా 10 లక్షల కారులో తిరుగుతున్న డైరెక్టర్.. గ్రేట్ కదా..?

Latest Videos


Nag Ashwin, Kamalhaasan

క్రియేటివిటీకి మారుపేరులా ఉంటాడు నాగ్ అశ్విన్..  సాధారణంగా కనిపించే వ్యక్తుల్లోనే అసాధారణ ప్రతిభ ఉంటుంది. నాగ్ అశ్విన్ విషయంలో లోకనాయకుడుకమల్ హాసన్ చెప్పిన మాటలివి. అన్నట్టుగానే చాలా సింపుల్ గా కనిపించే  ఈదర్శకుడు 4000 జీతం తీసుకునే స్థాయి నంచి 600 కోట్ల సినిమాను డ్రైవ్ చేయగలిగే స్థాయికి ఎదిగాడు. నాగ్ అశ్విన్ మిత భాషి.. చాలా తక్కువగా మాట్లాడుతాడు.. విలువైన మాటలు అందిస్తాడు.. 

చదువకునే రోజుల్లోనే కాలేజ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా పనిచేశాడు నాగ్ అశ్విన్.. తనకాలేజీలో చెట్టు కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. వ్యాసం రాసి.. తిట్లు తిన్నాడు. తల్లి తండ్రులు వైద్యులు కావడంతో.. తాను కూడా మెడిసిన్ కాని.. లేక సివిల్స్ కాని చదువుతాడు అని అనుకున్నారట ఫ్యామిలీ.. కాని మల్టీమీడియా కోర్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక అందులోనే సెటిల్ అవుతాడు అనుకుంటే.. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి మరో షాక్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. 

'కల్కి 2898 AD' ట్విట్టర్ రివ్యూ.. క్లైమాక్స్ ఊహకి కూడా అందదు, బాహుబలిని మించే పాన్ ఇండియా హిట్ పడ్డట్లేనా
 

శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగ్ అశ్వన్ కెరీర్ స్టార్ట్అయ్యింది. అయితే శేఖర్ కమ్ముల సినిమాకు టైమ్ ఉండటంతో.. మంచు మనోజ్ హీరోగా వచ్చిన నేను మీకు తెలుసా సినిమాకు పని చేసిన 4 వేలు జీతం అందుకున్నాడు నాగ్అశ్వన్. ఆతరువాత శేఖర్ కమ్ముల లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశాడు. అంతే కాదు మరో విశేషం ఏంటంటే.. లీడర్ ట్రైలర్ ను కట్ చేసింది నాగ్ అశ్విన్ నే .. అది బాగుండటంతో.. యాజిటీజ్ గా వదిలాడట శేఖర్ కమ్ముల. తన గురువు గొప్పతనం గురించి నాగ్ అశ్విన్ అప్పడప్పుడు ప్రస్తావిస్తాడు కూడా.
 

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరువాత రంగంలోకి దిగిన నాగ్ అశ్వన్.. ఓ యాడ్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ చేశాడు. అది చూసిన నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న.. వెంటనే అతనికి అవకాశం ఇచ్చారు. ఈలోపు ఎవడే సుబ్రహ్మణ్యం కథను రాసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈసినిమా తానే తక్కువ బడ్జెట్ లో చేయాలి అనుకున్నాడు. కాని స్వప్న, ప్రియాంక.. ఈమూవీ తామే నిర్మిస్తాం అన్నారట. దాంతో నాని,విజయ్ దేవరకొండ కాంబోలో మూవీ తెరకెక్కి.. అద్భుతం చేసింది.  ఈ మూవీకోసం నాని కంటే ముందు నవీన్ పొలిశెట్టిని హీరోగా అనుకున్నారు. 

ఇక నాగ్ అశ్వన్ కు కామెడీ అంటే చాలా ఇష్టం. కామెడీ సినిమాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే జాతిరత్నాలు కోసం ఆయన నిర్మాతగా మారాడు. అయితే ఈ ఫిల్మ్ జర్నీ కొనసాగుతుండగానే.. ఫ్రెండ్ గా ఉన్న ప్రియాంక ప్రేమికురాలిగా.. ఆతరువాత భార్యగా మారింది. వీరిద్దరు పెళ్ళి చేసుకున్నారు. ఈక్రమంలో నాగ్ అశ్వన్ చేసిన మరోసాహసం మహానటి. ఈసినిమాను చేయడం అంతే ఎంతో ధైర్యం ఉండాలి. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు నాగ్అశ్వన్. 

ఎక్కడా సావిత్రి గౌరవం దెబ్బతినకుండా.. ఎన్నిఇబ్బందులు ఎదురొచ్చినా..  మహానటి సినిమా అద్బుత దృశ్య కావ్యంగా మలిచి చూపించాడు నాగ్ అశ్విన్. సావిత్రమ్మ జీవితంలో ఇంకీ మెయిన్ పాత్రలు ఉన్నాయి..అవన్నీ చూపిస్తే.. సినిమా  30 గంటలు దాటుతుంది.. అందుకే ఆమె గౌరవం కాపాడుతూ... చేయగలిగినంత చేశాను అన్నారు నాగ్ అశ్విన్. కీర్తి సురేష్ మెయిన్ లీడ్ చేసిన మహానటి సినిమా నేషనల్అవార్డ్స్ తో పాటు.. కొన్నివిమర్శలను తీసుకువచ్చింది. 

ఇక నాగ్ అశ్విన్  చేసిన మరో అద్భుతం కల్కి. ప్రభాస్ హీరోగా భారీ తారాగణంతో ఆయన  తెరకెక్కించిన ఈ మహాద్భుతానికి వెనక దర్శకుడుఎన్నో ఏళ్ళు హోమ్ వర్క్ చేశాడు. కల్కి కథ రాసుకోవడానికే 5 ఏళ్ళు పట్టిందట. సైన్స్ ను, మైథలాజికల్ ఎలిమెంట్స్ ను మేళవించిన అదరిపోయే కథ రాసుకున్నాడు నాగ్ అశ్వన్.. అంతే అద్భుతంగా ఈ  సినిమాను దృశ్య కావ్యంలా మలిచాడు. 600 కోట్లతో తెరకెక్కిన  కల్కిని ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేశాడు నాగ్అశ్విన్.  ఎన్నివిమర్శలు వచ్చినా పట్టించుకోంకుండా తన పని తాను చేసుకుపోయాడు. 
 

ప్రభాస్ తో పాటు, అమితాబ్, దీపికా, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటించారీ సినిమాలో..ఈ రోజు రిలీజ్ అయిన కల్కీ 2829 AD మూవీ రివ్యూస్ బ్లాక్ బస్టర్ అన్నట్టుగా వచ్చాయి. సినిమా చూసి ఆడియన్స్ ట్విట్టర్ లో అద్భుతం అంటున్నారు. సినిమాలో ట్విస్ట్ లు.. ఊహించని క్లైమాక్స్ థ్రిల్లింగ్ గా ఉంది అంటున్నారు. లాంగ్ రన్ లో ఈసినిమా సాధించే విజయ్.. నాగ్ అశ్వన్ ను హాలీవుడ్ సినిమాలవైపు అడుగులు వేయిస్తుందేమో చూడాలి. బాహుబలి,ఆర్ఆర్ఆర్ తో ఇండియన్ సినిమాను  రాజమౌళి ఏకం చేస్తే.. నాగ్ అశ్విన్.. మాత్రం ఇండియన్ సినిమాను హాలీవుడ్ కు సమానంగా చూపించాలని తపనపడుతున్నాడు. 
 

click me!