Kajol Inspiring Journey : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ తన కెరీర్ ప్రారంభంలో తీవ్ర అవమానాలు, బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన సత్తా ఏంటో చూపించింది
సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్‌గా ఎదగడం అంటే అనేక సవాళ్లు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసి, స్టార్‌డమ్ సాధించిన చాలా మంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలోనే తీవ్ర అవమానాలు, బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్న వారే. అలాంటి అనుభవాలనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎదుర్కొందట, ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన సత్తా ఏంటో చూపించింది. 50 ఏండ్ల వయస్సు లోనూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
26
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీని ఊపేసిన ఈ బ్యూటీ, అప్పట్లో కుర్రకారు డ్రీమ్ గర్ల్. ఆమెను దేవతలాగా కొలిచేవారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. తన అందం, అభినయం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని ఏలేసింది. అయితే ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొందని తాజాగా చెప్పుకొచ్చింది.
36
కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న అవమానాలు
గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ మాట్లాడుతూ కెరీర్ ప్రారంభ దశలోనే తనను చాలా మంది ఎగతాళి చేసేవారని గుర్తు చేసుకుంది. “నువ్వు నల్లగా ఉన్నావు.. లావుగా ఉన్నావు.. హీరోయిన్ మెటీరియల్ కాదురా!” అంటూ హేళన చేశారని తెలిపింది. ఆ మాటలు విన్నప్పుడు ఎంతో బాధ పడ్డానని, ఒక దశలో తన ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయానని చెప్పింది.
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అందరి మాటలు భరించలేక కాస్త వెనక్కి తగ్గినప్పటికీ, తాను తనపై శ్రద్ధ పెట్టుకోవడం మొదలుపెట్టానని చెప్పింది. నెమ్మదిగా లుక్స్, ఫిట్నెస్‌పై దృష్టి సారించడంతో గ్లామర్‌లో మార్పు వచ్చిందని తెలిపింది. దీంతో కొందరు "కాజోల్ సర్జరీ చేయించుకుంది" అని రూమర్స్ క్రియేట్ చేశారని, కానీ అవి పూర్తిగా వదంతులేనని క్లారిటీ ఇచ్చింది.
56
స్టార్ హీరోయిన్ గా కాజోల్
ఈ ముద్దుగుమ్మ కేవలం 17 ఏండ్ల వయస్సులో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1992లో బేఖుది సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌తో చేసిన బాజీఘర్, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ), కభీ ఖుషీ కభీ ఘమ్, కరణ్ అర్జున్ వంటి సినిమాలు ఆమెకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. అందులో ‘డీడీఎల్’ సినిమా ముంబాయిలోని మరాఠా మందిర్‌లో దాదాపు 20 ఏళ్లకు పైగా నడిచి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
66
స్పెషల్ స్టార్‌డమ్
పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కాజోల్, తన తోటి నటుడు అజయ్ దేవ్‌గణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాజోల్ తండ్రి సోము ముఖర్జీ నిర్మాత, దర్శకుడు కాగా, తల్లి తనూజ కూడా ప్రముఖ నటి. తన భర్త అజయ్ దేవ్‌గన్ సరసన మొదటిసారి నటించిన సినిమా ‘హల్‌చల్’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా ‘హల్‌చల్’ మూవీ నుంచి ’తానాజీ’ వరకు తన భర్త అజయ్ దేవ్‌గణ్ నటించిన చిత్రాల్లో కథానాయికగా నటించింది. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, స్టార్‌డమ్‌ను పూర్తిగా తన టాలెంట్‌తోనే సంపాదించుకున్నానని కాజోల్ స్పష్టం చేసింది.