`బిగ్‌ బాస్‌ తెలుగు 9` గ్రాండ్‌ లాంచ్‌.. కొత్త హౌజ్‌ ఎలా ఉందో చూశారా? ఈ సారి ట్విస్ట్ ఏంటంటే?

Published : Sep 07, 2025, 06:58 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. అదిరిపోయే డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి. 

PREV
19
గ్రాండ్‌గా బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 ప్రారంభం

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. గత రెండు నెలలుగా ఊరిస్తున్న ఈ షో ఎట్టకేలకు ఆదివారం (సెప్టెంబర్‌ 7) సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. నాగార్జున అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో దాదాపు 15 మందితో ఈ షో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. వీరిలో సెలబ్రిటీ కంటెస్టెంట్లు, కామనర్స్ ఉంటారు. అయితే ఈ సారి రెండు హౌజ్‌లు ఉండబోతున్నాయి. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రోమోలో వెల్లడించారు. కామనర్స్ ఒక హౌజ్‌లో, సెలబ్రిటీలు మరో హౌజ్‌లో ఉండబోతున్నారని సమాచారం. అదేంటనేది కాసేపట్లో తేలనుంది.

29
బిగ్‌ బాస్‌ కొత్త హౌజ్‌ ఎలా ఉందంటే?

ఇదిలా ఉంటే ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ షోలో మెయిన్‌గా అందరి దృష్టిని ఆకర్షించేది హౌజ్‌. ఎందుకంటే అది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అదే సమయంలో ప్రతి రూమ్‌, హాల్‌ ఇలా అన్నీ ఒక థీమ్‌తో ఉంటాయి. డిజైన్స్ సరికొత్తగా ఆకట్టుకునేలా ఉంటాయి. మరి ఈ సారి ఎలా డిజైన్‌ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హౌజ్‌ని చూపించారు. నాగార్జున కళ్లకి గంతలు కట్టుకుని హౌజ్‌లోకి వెళ్లారు. హౌజ్‌ని పరిచయం చేశారు.

39
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో గార్డెన్ ఏరియా

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో గార్డెన్‌ ఏరియాని సరికొత్తగా డిజైన్‌ చేశారు. ఇందులోనూ బిగ్‌ బాస్‌ ఐస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. 

49
బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎంట్రీ లుక్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే వచ్చే హాల్‌ని సరికొత్తగా డిజైన్‌ చేశారు.  ఇది 9వ సీజన్‌ని ప్రతిబింబిచేలా ఉంది. 

59
బిగ్‌ బాస్‌ రెండో హౌజ్‌

బిగ్‌ బాస్‌ షోలో ఈ సారి రెండు హౌజ్‌లు ఉన్నాయట. రెండో హౌజ్‌ని ఇందులో చూపిస్తున్నారు. మొదటి హౌజ్‌ ఎంట్రీని, రెండో హౌజ్‌ని సస్పెన్స్‌ లో పెట్టారు. కాసేపట్లో రివీల్‌ చేయనున్నారు. నాగార్జున దీన్ని రివీల్‌ చేస్తారు. అయితే రెండో హౌజ్‌ మాత్రం అదిరిపోయేలా ఉందట. 

69
ఓపెన్‌ హాల్‌

ఇది బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఓపెన్‌ హాల్‌. అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి, అదే సమయంలో వీకెండ్‌లో నాగార్జున వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఉండే హాల్ ఇది. 

79
హౌజ్‌లోని డిజైన్స్

ఇది హౌజ్‌లోని స్టోర్‌ రూమ్‌ అని తెలుస్తోంది. హౌజ్‌ మేట్స్ కోసం ఫుడ్‌, ఇతర వస్తులు అందించే రూమ్‌ అని తెలుస్తోంది. 

89
వెయిటింగ్‌ హాల్‌

ఇది కంటెస్టెంట్లు సరదాగా మాట్లాడుకోవడానికి, వెయిటింగ్‌ హాల్‌లా ఉంది.  ఇందులోనుంచి బెడ్‌ రూమ్స్ కి దారి ఉంటుంది. 

99
బెడ్‌ రూమ్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇది మెయిన్‌ బెడ్‌ రూమ్‌. కంటెస్టెంట్లు అంతా ఇక్కడే నిద్రిస్తారు. ఇది చాలా విశాలంగా, లావిష్‌గా ఉంది. చాలా రొమాంటిక్‌గానూ డిజైన్‌ చేశారు. ఓవరాల్‌గా ఈ సారి హౌజ్‌ మాత్రం సరికొత్త లుక్‌లో దర్శనమిస్తుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories