పెళ్లై ఏడాది.. భర్తతో రొమాంటిక్‌ ఫోటోని పంచుకున్న కాజల్‌.. ఫన్నీ పోస్ట్ వైరల్‌

Published : Oct 30, 2021, 04:22 PM ISTUpdated : Oct 30, 2021, 04:23 PM IST

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ముంబయి బేస్డ్ బిజినెస్‌ మేన్‌ గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మ్యారేజ్‌ జరిగి సక్సెస్‌ఫుల్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ రొమాంటిక్‌ ఫోటోని పంచుకుంది కాజల్‌.   

PREV
18
పెళ్లై ఏడాది.. భర్తతో రొమాంటిక్‌ ఫోటోని పంచుకున్న కాజల్‌.. ఫన్నీ పోస్ట్ వైరల్‌

కాజల్‌(Kajal Agarwal) టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కమర్సియల్‌ సినిమాలకు హీరోయిన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది కాజల్‌. స్టార్ హీరోలకు, సీనియర్లకి Kajal మొదటి ఛాయిస్‌గా ఉంటూ వస్తోంది. అయితే ఉన్నట్టుంది తన పెళ్లి వార్తని వెల్లడించి షాకిచ్చింది. అభిమానులకు గుండె బద్దలయ్యే వార్తని వెల్లడించారు. 

28

పెళ్లికి నెల రోజుల ముందు లవ్‌ విషయాలకు హింట్‌ ఇస్తూ వచ్చిన కాజల్‌.. కరెక్ట్ గా గతేడాది అక్టోబర్‌ 6న అఫీషియల్‌గా ప్రకటించింది. అవును నేను ఎస్‌ చెప్పాను అంటూ గౌతమ్‌ కిచ్లు(Gautam Kitchlu)ని పరిచయం చేసింది. ఎంగేజ్‌మెంట్‌ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని కాజల్‌ తెలియజేయడం అభిమానులనే కాదు, సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతకు ముందు వారం రోజుల క్రితం తన ఫ్రెండ్స్ కి బ్యాచ్‌లరేట్‌ పార్టీ కూడా ఇచ్చింది. 
 

38

ముంబయికి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ బిజినెస్‌ని రన్‌ చేస్తున్న గౌతమ్‌ కిచ్లుతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. అక్టోబర్‌ 30న మ్యారేజ్‌ చేసుకోనున్నట్టు, కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో తమ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్టు తెలిపింది కాజల్‌. అయితే అన్ని రోజుల పాటు తమ ప్రేమ విషయాన్ని బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడిన కాజల్‌ ఇలా డైరెక్ట్ గా మ్యారేజ్‌ని ప్రకటించడం అభిమానులను షాక్‌కి గురి చేసింది. 
 

48

పెళ్లి తర్వాత భర్త గౌతమ్‌ కిచ్లుతో రెచ్చిపోయింది కాజల్‌. ఇన్నాళ్లు దాచుకున్న ప్రేమని భర్తపై వ్యక్తం చేస్తూ అనేక పోస్ట్ లు పెట్టింది. ఆ తర్వాత మాల్దీవుల్లో హనీమూన్‌ ఎంజాయ్‌ చేసి వచ్చింది. ఎవరూ జరుపుకోని విధంగా తమ హనీమూన్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా, హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల పాటు తమ పెళ్లి బంధాన్ని ఎంజాయ్‌ చేసిన కాజల్‌ తర్వాత సినిమాలపై ఫోకస్‌ పెడుతూ వచ్చింది. ఆమె నటిస్తున్న `ఆచార్య`, తమిళ చిత్రం `హే సినామిక` చిత్ర షూటింగ్‌లను పూర్తి చేసుకుంది. 
 

58

అదే సమయంలో భర్తతోనూ ఫ్యామిలీ లైఫ్‌కి కూడా వీలైనంత ఎక్కువ సమయం ఇస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి అనేక చోట్లకి వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తూ వస్తోంది. మరోవైపు భర్త బిజినెస్‌లోనూ భాగమవుతూ వస్తోంది. ఆయన ఇంటీరియర్‌ డిజైనింగ్‌కి సంబంధించి ప్రమోట్‌ చేస్తూ వస్తోంది. కొత్తగా దిండ్లకి సంబంధించిన వ్యాపారాన్ని కూడా స్టార్ట్ చేసింది కాజల్‌. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌, ఇంకో వైపు బిజినెస్‌ ఇలా మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. 
 

68

తాజాగా నేటితో(శనివారం) తమ వైవాహిక జీవితానికి ఏడాది పూర్తయ్యింది(Kajal first Wedding Anniversary). ఈ సందర్భంగా ఓ రొమాంటిక్‌ పిక్‌ని పంచుకుంది కాజల్‌. భర్తతో ఇంటెన్స్ మూడ్‌లో, చాలా క్లోజ్‌గా ఉన్న పిక్‌ని పంచుకుంది కాజల్‌. ఈ సందర్భంగా తమ ప్రేమకి విషెస్‌ చెప్పింది. `మీరు అర్ధరాత్రి గుసగుసలాడిన్నప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు మెలకువగా ఉన్నావా; నేను మీకు ఈ డాగ్‌ వీడియో చూపించాలి` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కాజల్‌. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. 
 

78

తమ ఫ్యామిలీ లైఫ్‌కి ఏడాది పూర్తయిన సందర్బంగా అభిమానులు, సెలబ్రిటీలు కాజల్‌ జోడికి ఫస్ట్ యానివర్సరీ విషెస్‌ తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఏడాది తమ ప్రేమ బంధాన్ని కూడా కాజల్‌-గౌతమ్‌ కిచ్లు జంట సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం కెరీర్‌ పరంగా కాజల్‌ తెలుగులో `ఆచార్య`, `ఘోస్ట్` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో `హే సినామిక`, `కరుంగాపియమ్‌` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో `ఉమా` అనే సినిమా చేస్తుంది. 

88

ఇదిలా ఉంటే కాజల్‌ పిల్లలకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య కాజల్‌ ప్రెగ్నెంట్‌ వార్తలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై కాజల్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కొత్తగా సినిమాలు కూడా ఒప్పుకోకపోవడంతో ఆమె పిల్లలు కనేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. 

also read: పునీత్, అశ్విని దంపతుల లవ్ స్టోరీ.. ఆమె ఎందుకు ప్రేమించిందంటే, భర్తే పంచప్రాణాలు..

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories