Puneeth rajkumar death: తల బాదుకుంటూ కన్నీరు మున్నీరైన బాలకృష్ణ.. పునీత్ పార్థివదేహం ముందు ఇలా

First Published Oct 30, 2021, 12:57 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా చాలా మంది స్టార్ సెలెబ్రిటీలు బెంగళూరు తరలి వెళుతున్నారు. తాజాగా Nandamuri Balakrishna కంఠీరవ స్టేడియంకు చేరుకొని పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఎనెర్జిటిక్ గా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. కన్నడ అభిమానులు పవర్ స్టార్, అప్పు అంటూ ముద్దుగా పిలుచుకునే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురై మరణించారు. 

ఇదిలా ఉండగా Puneeth Rajkumar పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. దీనితో కంఠీరవ స్టేడియం వద్ద అభిమానులు జనసంద్రంలా మారారు. వేలాదిమందిగా తరలి వస్తున్నాయి. ఇక ఇండియా నలుమూలల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు పునీత్ ని కడసారి చూసేందుకు తరలి వస్తున్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా చాలా మంది స్టార్ సెలెబ్రిటీలు బెంగళూరు తరలి వెళుతున్నారు. తాజాగా Nandamuri Balakrishna కంఠీరవ స్టేడియంకు చేరుకొని పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. పునీత్ పార్థివ దేహం ముందు బాలయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బాలకృష్ణని ఎంత ఎమోషనల్ గా అభిమానులు ఎప్పుడూ చూసి ఉండరు. పునీత్, బాలకృష్ణ మధ్య సాన్నిహిత్యం అలాంటిది. పునీత్ భౌతికకాయాన్ని చూడగానే బాలయ్య కన్నీటిపర్యంతమయ్యారు. తల బాదుకుంటూ అయ్యో ఇలా జరిగింది ఏంటి అంటూ వేదనకు గురయ్యారు. 

పునీత్ కుటుంబ సభ్యులని పరామర్శించిన అనంతరం బాలయ్య మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్, పునీత్ తండ్రి రాజ్ కుమార్ మధ్య మంచి రిలేషన్ ఉండేది. అప్పటి నుంచే రాజ్ కుమార్, నందమూరి కుటుంబాలు సన్నిహితంగా మెలగడం ప్రారంభించాయి. ఓ కార్యక్రమంలో బాలయ్య భుజంపై దుమ్ములాంటిది పడింది. దీనితో పునీత్ తన కర్చీఫ్ తో స్వయంగా బాలయ్య బుజం తుడిచాడు. ఆ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 

యువరత్న చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బాలయ్య తనకు అన్నయ్య లాంటివారని పునీత్ తెలిపాడు. అంతలా పునీత్, బాలయ్య మధ్య సాన్నిహిత్యం ఉంది. పునీత్ కు నివాళులు అర్పించిన అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు మమల్ని కలిపారు. ఈ దుర్ఘటన చూస్తుంటే దేవుడు ఎంత అన్యాయం చేశాడు అనిపిస్తోంది. పునీత్ మంచి మనిషి. సినిమాల ద్వారా వినోదాన్ని అందిస్తూ బాధ్యత గల పౌరుడిగా సామాజిక సేవలు చేశారు.

పునీత్ ఎప్పటికి ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉంటారు. పునీత్ మరణం వ్యక్తిగతంగా నాకు, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆ లోటుని ఎవరూ భర్తీ చేయలేరు. పునీత్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని బాలకృష్ణ తెలిపారు. ఇక పునీత్ కుమార్తె వందిత విదేశాల నుంచి ఈ సాయంత్రం 5 గంటలకు రానున్నట్లు తెలుస్తోంది. 

ఎన్టీఆర్, చిరంజీవి ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా పునీత్ ని కడసారి చూసేందుకు బెంగళూరు వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, చిరు ఇద్దరికి వ్యక్తిగతంగా పునీత్ బాగా క్లోజ్. 

click me!