కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఎనెర్జిటిక్ గా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. కన్నడ అభిమానులు పవర్ స్టార్, అప్పు అంటూ ముద్దుగా పిలుచుకునే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురై మరణించారు.