గూగుల్‌ సెర్చ్ లో కాజల్‌, సమంత, రష్మిక, అల్లు అర్జున్‌ హవా.. వెనకబడ్డ ఎన్టీఆర్‌, మహేష్‌, ప్రభాస్‌, చరణ్‌..

Published : Jun 27, 2022, 08:35 PM ISTUpdated : Jun 27, 2022, 09:03 PM IST

గూగుల్‌ సెర్చ్ లో ఏషియాలోనే టాప్‌లో నిలిచారు కాజల్‌, సమంత, రష్మిక, బన్నీ. వీరంతా టాప్‌ 20లో స్థానం సంపాదించుకుంటే, ఎన్టీఆర్‌, మహేష్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌లు వెనకబడిపోయారు. 

PREV
18
గూగుల్‌ సెర్చ్ లో కాజల్‌, సమంత, రష్మిక, అల్లు అర్జున్‌ హవా.. వెనకబడ్డ ఎన్టీఆర్‌, మహేష్‌, ప్రభాస్‌, చరణ్‌..

గూగుల్‌ సెర్చ్ ఆధారంగా ఓ సంస్థ ఏషియాలోనే ఎక్కువగా ఏ సెలబ్రిటీని గూగుల్‌లో సెర్చ్ చేశారనేది సర్వే తీయగా అందులో టాలీవుడ్‌ స్టార్స్ సత్తా చాటారు. టాప్‌ 100 ఏషియన్‌ సెలబ్రిటీలలో మన టాలీవుడ్‌ సెలబ్రిటీలు స్థానం సంపాదించారు. వారిలో టాప్‌ 20లో కాజల్‌, సమంత, రష్మిక, బన్నీ ఉన్నారు. తమన్నా, కీర్తిసురేష్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, తమన్నా, అనుష్క, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వెనకబడిపోవడం గమనార్హం. అయితే మన వారికంటే ముందు బాలీవుడ్‌ స్టార్స్ ఉండటం గమనార్హం. 
 

28

వారి వారి స్థానాలేంటనేది చూస్తే, కత్రినా కైఫ్‌ ఏడో స్థానంలో, అలియాభట్‌ ఎనిమిదో స్థానంలో, ప్రియాంక చోప్రా తొమ్మిదో స్థానంలో, విరాట్‌ కొహ్లీ పదో స్థానంలో, సల్మాన్‌ ఖాన్‌ పదకొండో స్థానంలో, షారూఖ్‌ ఖాన్‌ 12వ స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత 15వ స్థానంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ నిలవడం విశేషం. పదహారో స్థానంలో కరీనా కపూర్‌ నిలిచారు. 

38

నాగచైతన్యతో విడాకులు, హాట్‌ ఫోటో షూట్లు, అంతర్జాతీయ సినిమాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది సమంత. మరోవైపు ప్రస్తుతం టాలీవుడ్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సమంత మోస్ట్ సెర్చ్ డ్ ఏషియన్‌ సెలబ్రిటీలో 18వ స్థానం దక్కించుకుంది. ఆమె నాగచైతన్యతో విడాకుల తర్వాత తెలుగు నుంచి పాన్‌ ఇండియా చిత్రాలు, అంతర్జాతీయ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇమేజ్‌, క్రేజ్‌లోనూ సత్తాచాటుతూ ఆకట్టుకుంటుంది.

48

మరోవైపు స్టయిలీష్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌, పుష్పరాజ్‌.. అల్లు అర్జున్‌ సైతం ఇందులో స్థానం సంపాదించారు. ఆయన 19వ స్థానంలో నిలిచారు. ఆయన గత ఏడాది నుంచి `పుష్ప` సినిమా విషయంలో చర్చనీయాంశంగా నిలుస్తున్నారు. `పుష్ప` చిత్రంతో బన్నీ మానియా దేశం దాటి, అంతర్జాతీయంగానూ పాకిన విషయం తెలిసిందే. ఆయన పాటలు, మ్యానరిజం విదేశీయులు సైతం ఫాలో కావడం విశేషం. 
 

58

ఇక నేషనల్‌ క్రష్‌గా `పుష్ప` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మందన్నా. ఆమె కూడా ఇప్పుడు మోస్ట్ గూగుల్‌ సెర్చ్ డ్ ఏషియల్‌ సెలబ్రిటీలో టాప్‌ 20వ స్థానం దక్కించుకోవడం విశేషం. రష్మిక తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పాన్‌ ఇండియా చిత్రాల్లో భాగమవుతుంది. 
 

68

మిగిలిన 80 స్థానాల్లో హీరోలు.. దళపతి విజయ్‌ 22వ స్థానం, అక్షయ్‌ కుమార్‌ 25వస్థానం, రన్‌ బీర్‌ కపూర్‌ 31వ స్థానం, అమితాబ్‌ బచ్చన్‌ 36, యాష్‌ 40, హృతిక్‌ రోషన్‌ 41, అమీర్‌ ఖాన్‌ 42, మహేష్‌బాబు 47, అజయ్‌ దేవగన్‌ 52, రామ్‌చరణ్‌ 53, ఎన్టీఆర్‌ 58, ధనుష్‌ 61, సూర్య 63, ప్రభాస్‌ 68, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 73, రజనీకాంత్‌ 77, టైగర్‌ ష్రాఫ్‌ 89, వరుణ్‌ ధావన్‌ 93వ స్థానంలో నిలిచారు. 
 

78

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, ఐశ్వర్య రాయ్‌ 26వ స్థానంలో, దీపికా పదుకొనె 28వ స్థానం, నయనతార 33, తమన్నా 37, కాజోల్‌ 38, మాధురీ దీక్షిత్‌ 39, పూజా హెగ్డే 44, శ్రద్ధా కపూర్‌ 45, జాక్వెలిన్‌ 48, అనుష్క శర్మ 50, సోనాక్షి సిన్హా 54, అనుష్క శెట్టి 56, శిల్పా శెట్టి 59, కీర్తిసురేష్‌ 62, జాన్వీ కపూర్‌ 66, కంగనా రనౌత్‌ 71, శ్రీదేవి 75, మౌనీ రాయ్‌ 79, కృతి సనన్‌ 82, నేహా కక్కర్‌ 83, దిశా పటానీ 88, రకుల్‌ 91, అనన్య పాండే 98వ స్థానంలో నిలిచారు. 

88

వరల్డ్ వైడ్‌ అనే సంస్థ చేపట్టిన ఈ సర్వేలో వంద స్థానాల్లో అరవైకి పైగా ఇండియన్‌ సెలబ్రిటీలే ఉండటం విశేషం.  ఇందులో బాలీవుడ్‌ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. most searched asian celebraties on google list 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories