సుడిగాలి సుధీర్‌తో తన రిలేషన్‌ గురించి ఓపెన్‌ అయిన ఇంద్రజ.. మాట్లాడుతూ `జబర్దస్త్` జడ్జ్ ఎమోషనల్‌..

Published : Jun 27, 2022, 06:53 PM IST

బుల్లితెర స్టార్‌గా రాణించిన సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` వదిలేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. దీనిపై జడ్జ్ ఇంద్రజ స్పందించింది. సుధీర్‌ ఎందుకు జబర్దస్త్ ని విడిపోయాడనే ప్రశ్నకి ఆమె స్పందించింది.   

PREV
17
సుడిగాలి సుధీర్‌తో తన రిలేషన్‌ గురించి ఓపెన్‌ అయిన ఇంద్రజ.. మాట్లాడుతూ `జబర్దస్త్` జడ్జ్ ఎమోషనల్‌..

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించి టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఇంద్రజ.. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీఎంట్రీ తర్వాత ఆమె ఓ వైపు సినిమాల్లో బలమైన పాత్రలు చేస్తూ, మరోవైపు టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. ప్రస్తుతం ఆమె `జబర్దస్త్` షోకి జడ్జ్ గా ఉన్నారు. రోజా సీట్లో ఆమె జడ్జ్ గా చేస్తున్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్‌ యాంకర్‌గా చేసే `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి ఆమె జడ్జ్ గా ఉంటున్నారు. 

27

యాంకర్‌గా, మెజీషియన్‌గా, నటుడిగా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ లో కమేడియన్‌గా బాగా పాపులర్‌ అయ్యారు. అదే సమయంలో ఆయనకు హీరోగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం `వాంటెడ్‌ పండుగాడ్‌`, `గాలోడు`తోపాటు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో అటు `జబర్దస్త్`ని, ఇటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని వదిలేశాడు. దీనిపై తాజాగా ఇంద్రజ స్పందించింది. 
 

37

జడ్జ్ గా ఉన్న ఇంద్రజ.. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. సుడిగాలి సుధీర్‌ ఎందుకు `జబర్దస్త్` ని వదిలేశాడనే ప్రశ్నకి ఆమె షాకిచ్చింది. ఎవరి వ్యక్తిగత విషయాలను తాను మాట్లాడనని, తన గురించి తప్ప మరెవ్వరి పర్సనల్‌ విషయాలను తాను చెప్పనని, తెలిసినా చెప్పనని స్పష్టం చేసింది. 

47

అయితే సుడిగాలి సుధీర్‌ షోని వదిలేస్తున్న సందర్భంగా మీరు ఎలా ఫీలవుతున్నారనే ప్రశ్నకి చాలా బాధగా అనిపిస్తుందని తెలిపింది. `జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంపై కెవ్వు కార్తీక్ ఓ స్కిట్ చేశాడు. కార్తీక్ సుధీర్‌లా కళ్ల అద్దాలు పెట్టుకునేటప్పుడు నాకు సుధీర్‌ గుర్తొచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఏడ్చేశాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. 

57

సుధీర్‌ను నేను సిద్దూ అని పిలుస్తా. చాలా మిస్ అయ్యా. నన్ను ప్రేమగా రాజీ అని సుధీర్ పిలుస్తాడు. అతను అమ్మ అని పిలవడం చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోవడం చాలా ఇష్టం. జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకు. చాలా మంచి అబ్బాయి. అతనికి వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చా` అని ఇంద్రజ తెలిపారు.

67

సుధీర్‌కి తనకు ఏజ్‌ గ్యాప్‌ తక్కువగానే ఉన్నా ఇద్దరి మధ్య తల్లి కొడుకు అనుబంధం ఉంటుందని తెలిపింది. అంతేకాదు అతనితో తన బాండింగ్‌ చాలా స్పెషల్‌ అని, అందుకే ఎమోషనల్‌ అయ్యానని తెలిపింది ఇంద్రజ. 
 

77

ఇదిలా ఉంటే `శ్రీదేవి డ్రామా కంపెనీ` షో నుంచి ఇంద్రజ కూడా తప్పుకున్నారు. సుధీర్‌ వెళ్లిపోయిన తర్వాత ఇంద్రజని కూడా తొలగించారు. ఆమె స్థానంలో పూర్ణని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంద్రజ `జబర్దస్త్` కే పరిమితమయ్యారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories