అలియా భట్ కంటే ముందు…రణబీర్ కపూర్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసా...?

Published : Jun 27, 2022, 05:39 PM IST

బాలీవుడ్ లో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోలలో రణబీర్ కపూర్ ది మొదటి స్థానం. ఈ యంగ్ స్టార్  రీసెంట్ గా హీరోయిన్  అలియా భట్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రీసెంట్ గా వీరి  వివాహం  జరిగింది. ముంబైలో వారి కుటుంబ సభ్యుల మధ్య వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆలియా కంటే ముందు రణ్ భీర్ కపూర్ చాలా మందితో రిలేషన్ షిప్ మెయింటేన్ చేశాడు. మరి రణ్ బీర్ తో బ్రేకప్ అయిన ఆ హీరోయిన్లు ఎ వరు...?

PREV
19
అలియా భట్ కంటే ముందు…రణబీర్ కపూర్ తో  రిలేషన్‌షిప్‌లో ఉన్న  హీరోయిన్స్ ఎవరో తెలుసా...?

రణబీర్ కపూర్ కు బాలీవుడ్ మన్మథుడు అన్న పేరు ఉంది. ఆయన ఖాతాలో చాలామంది స్టార్ హీరోయిన్లు గర్ల్ ఫ్రెండ్స్ గా ఉన్నారు.  అంతకముందు కొంత మంది హీరోయిన్స్ తో, అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

29

రణబీర్ కపూర్, దీపికా పదుకొనే కొంత కాలం ప్రేమలో ఉన్నారు. చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. అయితే వీరిద్దర మధ్య మనస్పర్థలు కారణంగా విడిపోయారు. ఆ తర్వత  దీపికా యంగ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్ళాడి హ్యపీగా ఉంటుంది. అప్పుడప్పుడు తన బ్రేకప్ వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించింది చెపుతూ ఉంటుంది స్టార్ హీరోయిన్. 

39

బాలీవుడ్ లో ఎక్కువ లవ్ ఎఫైర్ రూమర్స్ ఉన్న హీరోయిన్ కత్రీనా కైఫ్ రీసెంట్ గా యంగ్ హీరో..  విక్కీ కౌశల్ ను పెళ్ళాడిన ఈ ముద్దుగుమ్మ గతంలో  రణ్ భీర్ కపూర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినట్టు బాలీవుడ్ కోడై  కూసింది. ఆతరువాత వీరిద్దరు  విడిపోయారు.

49

ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చేరియ మరో సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా గతంలో  రణబీర్ కపూర్ తో రిలేషన్ లో ఉందట. వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరికి మధ్య రిలేషన్ ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

59

రణబీర్ కపూర్ హీరోగా అడుగు పెట్టక ముందు అవంతిక మాలిక్ తో రిలేషన్ లో ఉన్నారు. తర్వాత అవంతిక అమీర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్ ని పెళ్లి చేసుకున్నారు. అతే కాదు  రణబీర్ కపూర్ తన కంటే వయసులో పది సంవత్సరాలు పెద్ద అయిన నందిత మహతాని అనే ఒక డిజైనర్ తో రిలేషన్ లో ఉన్నారట.

69

రణ్ బీర్ కపూర్ కు బాలీవుడ్ హీరోయిన్  సోనమ్ కపూర్, రణబీర్ కపూర్ కలిసి సావరియా సినిమాలో నటించారు. అప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
 

79

రణబీర్ కపూర్ నర్గీస్ ఫక్రీ కూడా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. రణబీర్ కపూర్, పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వారిద్దరి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

89

బాలీవుడ్ నటి అమీషా పటేల్, రణబీర్ కూడా ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. రణబీర్ కపూర్, కింగ్ ఫిషర్ మోడల్ ఏంజెలా జాన్సన్ కుడా రిలేషన్ లో ఉన్నారు అనే వార్త ప్రచారం అయింది.
 

99

బాలీవుడ్ హీరోయిన్లతోనే కాదు రణ్ బీర్ కపూర్ కు సౌత్ హీరోయిన్లతో కూడా ప్రేమ కహానీలు చాలా ఉన్నాయి ముఖ్యంగా శృతీ హాసన్ తో రణ్ బీర్ డేటింగ్ చేశార్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. వీరిద్దరు కలిసి ఒక ప్రకటనలో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఈ రిలేషన్ షిప్ వార్తలు వచ్చాయి.  ఇక ఫైనల్ గా దాదాపు  ఐదు సంవత్సరాలు రిలేషన్ లో ఉన్న తర్వాత రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories